Chandrababu Tears: చంద్రబాబుకు ఫోన్ చేసి పలకరించిన సూపర్ స్టార్ రజినీ కాంత్

టీడీపీ అధినేత చంద్రబాబుకు స్టార్ హీరో రజనీ కాంత్ ఫోన్ చేశారు. అసెంబ్లీలో జరిగిన ఘటన, టీడీఎల్పీ సమావేశంలో కన్నీటి పర్యంతం కావడంపై పరామర్శించారు.

Chandrababu Tears: చంద్రబాబుకు ఫోన్ చేసి పలకరించిన సూపర్ స్టార్ రజినీ కాంత్

Chandrababu (2)

Updated On : November 21, 2021 / 9:50 AM IST

Chandrababu Tears: టీడీపీ అధినేత చంద్రబాబుకు స్టార్ హీరో రజనీ కాంత్ ఫోన్ చేశారు. అసెంబ్లీలో జరిగిన ఘటన, టీడీఎల్పీ సమావేశంలో కన్నీటి పర్యంతం కావడంపై పరామర్శించారు. ఇందులో భాగంగానే మీడియా ద్వారా తనకు తెలిసిన సమాచారంపై చంద్రబాబుకి ఫోన్ చేసి.. అసెంబ్లీలో ఘటన గురించి వాకబు చేశారు.

అసెంబ్లీ వేదికగా సీఎం అయ్యాకే వస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు శపథం చేయడం, టీడీఎల్పీ సమావేశంలో కన్నీరు పెట్టడం అంశాలు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిపోయాయి. తన భార్యను కించపరిచారంటూ అవమానంగా మాట్లాడారంటూ ప్రెస్ మీట్ వేదికగా చెప్పి విలిపించారు చంద్రబాబు. దీనిపై నందమూరి కుటుంబం స్పందించి బాలకృష్ణ నివాసంలో ప్రెస్ మీట్ పెట్టి నారా భువనేశ్వరిని కించపరిచారని వైఎస్సార్సీపీ నేతల కామెంట్లను ఖండించారు.

…………………………………….. : అమ్మకానికి పాము విషం- ధర తెలిస్తే……