Chandrababu : స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా

తాము కౌంటర్‌ దాఖలు చేయడానికి సిద్ధంగానే ఉన్నాం కానీ, 17ఏ తీర్పుతో ముడిపడి ఉందన్న విషయాన్ని సాల్వే ప్రస్తావించారు. సాల్వే వాదనతో జస్టిస్‌ బేలా ఎం త్రివేది, జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ ధర్మాసనం ఏకీభవించింది.

Chandrababu : స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా

Chandrababu

Chandrababu Bail Cancellation Petition : స్కిల్‌ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జనవరి 19కి వాయిదా పడింది. 17ఏ వ్యవహారంపై తీర్పు ఇచ్చేట్లు అయితే వాయిదా వేయాలని లేదా విచారణ తేదీ ఖరారు చేయాలని చంద్రబాబు తరపు సీనియర్‌ న్యాయవాది హరీష్‌ సాల్వే కోరారు. నోటీసులు జారీ చేసినా ఇంకా కౌంటర్‌ దాఖలు చేయాలేదని ప్రభుత్వం తరపు న్యాయవాది రంజిత్‌ కుమార్‌ కోర్టుకు తెలిపారు.

తాము కౌంటర్‌ దాఖలు చేయడానికి సిద్ధంగానే ఉన్నాం కానీ, 17ఏ తీర్పుతో ముడిపడి ఉందన్న విషయాన్ని సాల్వే ప్రస్తావించారు. సాల్వే వాదనతో జస్టిస్‌ బేలా ఎం త్రివేది, జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ ధర్మాసనం ఏకీభవించింది. జనవరి మూడో వారంలో విచారణ చేపడతామని ధర్మాసనం తెలిపింది.

Also Read: రేవంత్ రెడ్డి గెలుపుపై కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు

ఏదో ఒక తేదీ ఖరారు చేయాలని సాల్వే కోరారు. సాల్వే విజ్ఞప్తితో విచారణను జనవరి 19కి ధర్మాసనం వాయిదా వేసింది. ఆ లోపు కౌంటర్‌ దాఖలు చేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులకు, దానికి రిజాయిండర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది.