Child Died : పందులను వేటాడుతుండగా.. తుపాకీ తూటా తగిలి చిన్నారి మృతి

వేగాళ్ల గురి తప్పి పందులకు తగలాల్సిన తూటా అదే ప్రాంతంలో తోటి పిల్లలతో ఆటాడుకుంటున్న పలివెల ధన్యశ్రీ అనే చిన్నారికి తగిలింది. దీంతో చిన్నారి కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందారు.

Child Died : పందులను వేటాడుతుండగా.. తుపాకీ తూటా తగిలి చిన్నారి మృతి

child died (1) (1)

Updated On : August 15, 2023 / 3:42 PM IST

Gunshot Child Died : ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లాలో దారుణం జరిగింది. పందులను వేటాడుతుండగా తుపాకీ తూటా తగిలి చిన్నారి మృతి చెందారు. ఈ ఘటన వెలమకొత్తూరులో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపినవ వివరాల ప్రకారం.. వెలమకొత్తూరు గ్రామంలో అనుమతులు లేకుండా వేటగాళ్లు నాటు తుపాకులతో వేటాడుతూ పందులపై కాల్పులు జరిపారు.

ఈ క్రమంలో వేగాళ్ల గురి తప్పి పందులకు తగలాల్సిన తూటా అదే ప్రాంతంలో తోటి పిల్లలతో ఆటాడుకుంటున్న పలివెల ధన్యశ్రీ అనే చిన్నారికి తగిలింది. దీంతో చిన్నారి కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందారు. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే ఘటనాస్థలికి వచ్చి చూసే సరికి అప్పటికే చిన్నారి మృతి చెందారు. చిన్నారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

Mobile Charger : గుండెలు పిండే తీవ్ర విషాదం.. ఫోన్ ఛార్జర్ పిన్ నోట్లో పెట్టుకుని 8నెలల చిన్నారి మృతి, తల్లిదండ్రులూ బీకేర్ ఫుల్

చిన్నారి మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.