Chandra babu Covid positive: కరోనా సోకిన చంద్రబాబు త్వరగా కోలుకోవాలి : చైనా రాయబారి లెటర్

టీడీపీ అధినేత చంద్రబాబు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ.. చైనా రాయబారి బాబుకు లేఖ రాశారు.

Chandra babu Covid positive: కరోనా సోకిన చంద్రబాబు త్వరగా కోలుకోవాలి : చైనా రాయబారి లెటర్

China Ambassador Writes Letter To Chandrababu

Updated On : January 19, 2022 / 5:30 PM IST

China ambassador writes letter to Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆయన త్వరగా కోలుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ సహా పలువురు ఆకాంక్షించారు. తాజాగా చంద్రబాబుకు భారత్ లోని చైనా రాయబారి సున్ వెయిడాంగ్ లేఖ రాశారు.

ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబు హోంఐసోలేషన్‌లో ఉన్న చంద్రబాబు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తన ఆరోగ్యం గురించి ఆలోచించేవారందరికి ధన్యవాదాలు తెలిపారు. మీ అభిమానంతో త్వరలోనే పూర్తిగా కోలుకు వస్తానని తెలిపారు.

అలాగే ఇటీవల కాలంలో తనకు సన్నిహితంగా ఉన్నవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కాగా..చంద్రబాబునాయుడు కుమారుడు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి లోకేశ్‌కు మంగళవారం కొవిడ్‌ పాజిటివ్ గా నిర్ధరణ అయిన విషయం తెలిసిందే.