Chocolates On Road : రోడ్డుపై గుట్టలు గుట్టలుగా చాక్లెట్లు
రోడ్డు పక్కన చాక్లెట్‌లు, ప్రోటిన్ పౌడర్‌లను కుప్పలుగా పారేశారు. అయితే, వీటిని కొందరు స్థానికంగా ఉన్న చిన్న పిల్లలు, యువకులు తమ బ్యాగులలో నింపుకొవడానికి ఎగపడ్డారు. తీరా ఇంటికి తీసుకెళ్లి చూడగా అవన్నీ కాలం చెల్లినవిగా గుర్తించారు.

Chocolates On Road
Chocolates On Road : చాలామంది చాక్లెట్‌లు ఇష్టంగా తింటారు. ప్రేమికులు తమ ప్రేమను వ్యక్తపరిచేందుకు చాక్లెట్ నే ఎక్కువ ఇస్తుంటారు. ప్రేయసి అలకబూనినప్పుడు చాక్లెట్ దివ్య ఔషధమని ఎవరిని అడిగినా చెబుతుంటారు. ఇలా బంధాలను కలపడానికి, మధురానుభూతులు పంచడానికి ఉపయోగపడే చాక్లెట్‌లను రోడ్డుపై పడేశారు గుర్తుతెలియని వ్యక్తులు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది.
ఏసీ నగర్ రోడ్డు పక్కన చాక్లెట్‌లు, ప్రోటిన్ పౌడర్‌లను కుప్పలుగా పారేశారు. అయితే, వీటిని కొందరు స్థానికంగా ఉన్న చిన్న పిల్లలు, యువకులు తమ బ్యాగులలో నింపుకొవడానికి ఎగపడ్డారు. తీరా ఇంటికి తీసుకెళ్లి చూడగా అవన్నీ కాలం చెల్లినవిగా గుర్తించారు. ఇక విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో చాకోలెట్లను స్వాధీనం చేసుకున్నారు.
ఎవరైనా షాప్ తీసేసే సమయంలో తన షాప్ లో మిగిలిపోయిన చాకోలెట్లను ఇలా పడేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.