’నన్ను విమర్శించడానికే మోడీ విశాఖ వచ్చారు’ : సీఎం చంద్రబాబు

  • Published By: veegamteam ,Published On : March 1, 2019 / 04:48 PM IST
’నన్ను విమర్శించడానికే మోడీ విశాఖ వచ్చారు’ : సీఎం చంద్రబాబు

Updated On : March 1, 2019 / 4:48 PM IST

అమరావతి : ప్రధాని మోడీకి ఏపీ సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చాడు. మమ్మల్ని విమర్శించే హక్కు మోడీకి లేదన్నారు. సరిహద్దులో యుద్ధం జరుగుతుంటే మోడీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తనను విమర్శించడానికే మోడీ విశాఖకు వచ్చారని పేర్కొన్నారు. పాక్ తో యుద్ధం వస్తుందని రెండేళ్ల క్రితమే పవన్ కళ్యాణ్ చెప్పారంటే ఎవరికి దేశభక్తి ఉందో తెలుస్తుందన్నారు. రాజకీయాలను దేశభక్తితో ముడిపెట్టడం సరికాదని హితువుపలికారు. సైనిక కుటుంబాలను ఆదుకున్న చరిత్ర టీడీపీది అన్నారు.