MLAs Skit : కూటమి ఎమ్మెల్యేల కామెడీ స్కిట్.. పడి పడి నవ్విన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..

కూటమి నేతల స్కిట్ కు, డైలాగులకు, అభినయానికి.. చంద్రబాబు, పవన్ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు.

MLAs Skit : కూటమి ఎమ్మెల్యేల కామెడీ స్కిట్.. పడి పడి నవ్విన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..

Updated On : March 20, 2025 / 9:16 PM IST

MLAs Skit : కూటమి ఎమ్మెల్యేల కామెడీ స్కిట్ నవ్వులు పూయించింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పడి పడి నవ్వుకున్నారు. ఇదీ సంగతి పేరుతో కూటమి ఎమ్మెల్యేలు ప్రదర్శించిన కామెడీ స్కిట్ చూసి చంద్రబాబు, పవన్ కల్యాణ్ పొట్టచెక్కలయ్యేలా నవ్వారు.

ఇదీ సంగతి అంటూ హాస్య నాటకం ప్రదర్శించారు చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, జూలకంటి బ్రహ్మానంద రెడ్డి, కూన రవికుమార్, పాశం సునీల్, అరవిందబాబు, వర్ల కుమార్ రాజా. జనాభా పెరుగుదలపై సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రకటనలపై కామెడీ స్కిట్ ప్రదర్శించారు నేతలు.

సబ్జెక్ట్ లు పాస్ కాకపోయినా తెలుగుదేశం నేతలకు చెందిన నారాయణ, భాష్యం, విజ్ఞాన్, ఎన్నారై కళాశాలల్లో సీటు ఇప్పించాలంటూ అమాయక పాత్రలో ఆకట్టుకున్నారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి. పాస్ కాని విద్యార్థికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో సీటు ఇప్పించలేని ఎమ్మెల్యే ఎందుకంటూ హాస్యం పండించిన జూలకంటి.

Also Read : కొడాలి నాని టార్గెట్‌గా పావులు కదులుతున్నాయా?

పాస్ కాకపోతే ఏ ఎమ్మెల్యే అయినా సీటు ఇప్పించలేడు అంటూ కార్యకర్త కోరిక తీర్చలేక సహనం పాటించే పాత్రలో ఆకట్టుకున్నారు జీవీ ఆంజనేయులు. పది పాస్ కాని విద్యార్థికి ఎస్పీ ఉద్యోగం, బాలయ్య బాబు, పవన్ కల్యాణ్ తో సినిమా డైరెక్షన్ ఇప్పించాలంటూ కార్యకర్తల పాత్రలు పోషించారు కూనరవి, అరవింద్ బాబు.

ఏపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మూడు రోజుల పాటు ఆటల పోటీలు జరిగాయి. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన ఈ పోటీల్లో సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ క్రీడల పోటీల్లో విజేతలకు విజయవాడ ఏ1 కన్వెన్షన్ సెంటర్ లో బహుమతుల ప్రదానోత్సవం జరిగింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, స్పీకర్ అయ్యన్నపాత్రుడు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Also Read : అటెండెన్స్‌ రిజిస్టర్‌లో సంతకాలు పెట్టి తిరిగి వెళ్లిపోతున్నారా? ఏం జరుగుతోంది?

ఈ సందర్భంగా కూటమి ఎమ్మెల్యేలు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కూటమి నేతల స్కిట్ కు, డైలాగులకు, అభినయానికి.. చంద్రబాబు, పవన్ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.