Cm Chandrababu Naidu : భారతీయుల రక్తంలోనే వ్యాపార లక్షణాలు ఉన్నాయి- సీఎం చంద్రబాబు

భారతీయులు అందిస్తున్న సేవల పట్ల గర్వ పడుతున్నానని చెప్పిన చంద్రబాబు.. భవిష్యత్తులోనూ ఇలానే భారతీయులు ప్రపంచానికి సేవలు అందించాలని చెప్పారు.

Cm Chandrababu Naidu : భారతీయుల రక్తంలోనే వ్యాపార లక్షణాలు ఉన్నాయి- సీఎం చంద్రబాబు

Updated On : January 22, 2025 / 12:34 AM IST

Cm Chandrababu Naidu : ప్రపంచంలోని అనేక దేశాల్లో రాజకీయ అనిశ్చితి ఉందని.. భారత్ లో మాత్రం ప్రధాని మోదీ నాయకత్వంలో స్థిరమైన ప్రభుత్వం కొనసాగుతోందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. సరైన సమయంలో మోదీ లాంటి నేత భారత్ ను పాలిస్తున్నారని కితాబిచ్చారు. దావోస్ పర్యటనలో భాగంగా గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్ పై సీఐఐ నిర్వహించిన సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.

ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతీయ పారిశ్రామికవేత్తలే కనిపిస్తున్నారని, భారతీయ రక్తంలోనే వ్యాపార లక్షణాల ఉన్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. భారతీయులు అందిస్తున్న సేవల పట్ల గర్వ పడుతున్నానని చెప్పిన చంద్రబాబు.. భవిష్యత్తులోనూ ఇలానే భారతీయులు ప్రపంచానికి సేవలు అందించాలని చెప్పారు.

అటు దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫుల్ బిజీగా గడుపుతున్నారు. భారత్ లో హరిత పారిశ్రామిక విధానంపై ఆయన ప్రసంగించారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా ఏపీ మారబోతోందని తెలిపారు. సౌర, పవన, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిపై ఎక్కువ దృష్టి పెట్టామని, 115 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఇంధన వనరుల్లో వస్తున్నాయని చెప్పారు చంద్రబాబు. 500 మెగావాట్ల 5 ఎంపీటీఏ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయబోతున్నామన్న చంద్రబాబు.. ఎన్టీపీసీ, ఏపీ జెన్ కో సంయుక్తంగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తాయని తెలిపారు.

Also Read : ఫ్యూచర్‌ లీడర్‌గా లోకేశ్‌కు తెలుగు తమ్ముళ్ల ఎలివేషన్.. బాబు వార్నింగ్‌ ఇచ్చినా టీడీపీ నేతలు ఎందుకు తగ్గట్లేదు?