రెండో విడత నామినేటెడ్ పదవులపై సీఎం చంద్రబాబు కసరత్తు.. వారి నుంచి ఒత్తిళ్లు..!

ఇప్పుడు నామినేటెడ్ పోస్టులను మూడు భాగాలు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి.

రెండో విడత నామినేటెడ్ పదవులపై సీఎం చంద్రబాబు కసరత్తు.. వారి నుంచి ఒత్తిళ్లు..!

Updated On : November 8, 2024 / 10:35 PM IST

Nominated Posts : నామినేటెడ్ పదవుల భర్తీపై సీఎం చంద్రబాబు కసరత్తు ప్రారంభించారు. రెండు రోజులుగా పార్టీ నేతలతో విస్తృత చర్చలు జరుపుతున్నారు. నిన్న ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తోనూ సమావేశమైన చంద్రబాబు.. నామినేటెడ్ పదవులపై చర్చించారు. తమ నేతల పేర్లను బీజేపీ ఇప్పటికే పంపించింది. అసెంబ్లీ సమావేశాల కంటే ముందే రెండో విడత నామినేటెడ్ పదవుల లిస్ట్ తయారు చేసే యోచనలో ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.

నామినేటెడ్ పోస్టులకు సంబంధించి చంద్రబాబుపై చాలా ప్రెజర్స్ ఉన్నాయి. పార్టీ కోసం, ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పని చేసిన అనేక మంది నాయకులు నామినేటెడ్ పదవులు ఆశిస్తున్నారు. కాగా, ఇప్పుడు నామినేటెడ్ పోస్టులను మూడు భాగాలు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ప్రాధాన్యత క్రమంలో ఎవరికి ఏ పోస్టు ఇవ్వాలి అనేదానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చలు ప్రారంభించారు. ఇప్పటికే దానికి సంబంధించి చంద్రబాబు దగ్గర ఒక పిక్చర్ ఉందని చెప్పొచ్చు. రెండో విడత నామినేటెడ్ పోస్టుల్లో జనసేనకు ఎన్ని ఇవ్వాలి, బీజేపీకి ఎన్ని ఇవ్వాలి, తెలుగుదేశం పార్టీకి ఎన్ని కేటాయించాలి అనే దానిపై చంద్రబాబు కసరత్తు ప్రారంభించారు.

వీటిలో కొన్ని ముఖ్యమైన పోస్టులు ఉన్నాయి. దానికి సంబంధించి తెలుగు దేశం పార్టీ నాయకుల నుంచి చంద్రబాబుపై ఒత్తిళ్లు ఉన్నాయి. గతంలో పార్టీ కోసం అనేకమైన కేసులు ఎదుర్కొని పని చేసిన వారంతా నామినేటెడ్ పోస్టుల ద్వారా తమకు న్యాయం చేయాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేసిన పరిస్థితి. అంతేకాకుండా పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతల నుంచి కూడా చంద్రబాబుపై ఒత్తిళ్లు ఉన్నాయి. తమ వర్గానికి చెందిన వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని ప్రెజర్ చేస్తున్నారు. దీంతో చంద్రబాబు ఆ దిశగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

ఎవరికి ఏ పదవి ఇస్తే బాగుంటుంది అనేదానిపై ముఖ్యనేతలతో సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. నామినేటెడ్ పదవుల్లో బీజేపీకి కేటాయింపులు తక్కువగా ఉండే అవకాశం ఉంది. జనసేనకు కొంత ప్రాధాన్యత ఉండే అవకాశం స్పష్టంగా ఉంది. ముఖ్యమైన పోస్టులను ఆయా ప్రాంతాలను బట్టి, ఆయా ప్రాంతాలను ప్రభావితం చేసే నాయకులను దృష్టిలో పెట్టుకుని పదవులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో ఎన్నికల సమయంలో టికెట్లు ఆశించి పొత్తుల వల్ల చివరి నిమిషంలో భంగపడ్డ వారు.. నామినేటెడ్ పదవులు ఆశిస్తున్నారు. వారి నుంచి కొంత ఒత్తిడి ఉంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు.

Also Read : కుప్పం, హిందూపురం మున్సిపాలిటీలపై టీడీపీ గురి.. చంద్రబాబు, బాలకృష్ణ మాస్టర్ ప్లాన్