Cm Chandrababu: నేరస్తులకు అండగా నిలవడం ఏంటి? రాష్ట్రంలో ప్రమాదకర రాజకీయాలు నడుస్తున్నాయన్న సీఎం చంద్రబాబు

ప్రజా సమస్యల పరిష్కారమే మన అజెండా కావాలన్నారు. మరింత దూకుడు పెంచి ప్రజలతో మమేకం కావాలని..

Cm Chandrababu: నేరస్తులకు అండగా నిలవడం ఏంటి? రాష్ట్రంలో ప్రమాదకర రాజకీయాలు నడుస్తున్నాయన్న సీఎం చంద్రబాబు

Updated On : June 4, 2025 / 4:55 PM IST

Cm Chandrababu: రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రమాదకర రాజకీయాలు నడుస్తున్నాయని చంద్రబాబు అన్నారు. రాజకీయ నాయకులు ఒకప్పుడు నేరస్తులను కలవాలంటేనే భయపడే వారని చంద్రబాబు అన్నారు. అలాంటిది ఇప్పుడు నేరస్తులను అడ్డం పెట్టుకునే రాజకీయాలు చేస్తున్నారని వాపోయారు. క్రిమినల్స్ కు కొమ్ముకాస్తూ ప్రజలకు ఎలాంటి సందేశమిస్తున్నారో, రాజకీయాలను ఎటు తీసుకెళ్తున్నారో అర్ధం కావట్లేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

కూటమి ప్రభుత్వం ఏడాది పరిపాలనపైనా సీఎం చంద్రబాబు స్పందించారు. కూటమి సర్కార్ ఏడాది పాలన అంతా బాగుందన్నారు. మంత్రులు మరింత సమర్థవంతంగా పని చేయాలని చంద్రబాబు సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారమే మన అజెండా కావాలన్నారు. మరింత దూకుడు పెంచి ప్రజలతో మమేకం కావాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు చంద్రబాబు.

Also Read: తిరుమల కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. దూకుడు పెంచిన సిట్..

తెనాలిలో ముగ్గురు రౌడీషీటర్లను పోలీసులు కొట్టారని వైసీపీ చీఫ్ జగన్ పరామర్శించడంపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఇవాళ్టి మంత్రివర్గ సమావేశంలో జగన్ తీరుపై చంద్రబాబు మండిపడ్డారు. నేరస్తులకు మద్దతుగా నిలవడం ఏంటి అంటూ జగన్ తీరుపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ప్రమాదకర రాజకీయాలు నడుస్తున్నాయి అంటూ విరుచుకుపడ్డారు. నేరస్తులకు తాము అండగా ఉన్నాము అని ప్రజలకు సందేశం ఇచ్చేలా రాజకీయాలను తీసుకెళ్తున్నారని జగన్ ను ఉద్దేశించి విమర్శలు చేశారు చంద్రబాబు. అసలు రాజకీయాలను ఎటు తీసుకెళ్తున్నారో అర్థం కావడం లేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. నేరస్తులను కలవడం ద్వారా వారిని జగన్ ప్రోత్సహించినట్లు ఉందని చంద్రబాబు వాపోయారు. రాజకీయ నాయకుల నడవడిక ప్రజలకు మంచి సందేశం ఇచ్చేలా ఉండాలని చంద్రబాబు హితవు పలికారు.