AP Students: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్..

AP Students: ఏపీలోని కూటమి ప్రభుత్వం విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది. విదేశాల్లో చదువుకోవాలని భావించే వారికి

AP Students: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్..

CM Chandrababu Naidu,

Updated On : October 6, 2025 / 6:42 PM IST

AP Students: ఏపీలోని కూటమి ప్రభుత్వం విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది. విదేశాల్లో చదువుకోవాలని భావించే వారికి ప్రభుత్వం అండగా నిలిచేందుకు నిర్ణయించింది. సోమవారం సంక్షేమ శాఖలపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి, ఫరూఖ్, సవిత, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సూపర్ సిక్స్ సహా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ సంక్షేమానికి అందుతున్న పథకాలపై చంద్రబాబు చర్చించారు. వెనుకబడిన వర్గాల సాధికారిత లక్ష్యంగా శాఖలు పని చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా.. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలని భావిస్తున్న వారికి ఆర్థిక సాయం అందించాలని చంద్రబాబు పేర్కొన్నారు.

Also Read: Pawan Kalyan : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జిల్లాల టూర్.. ప్రభుత్వ కార్యక్రమాలు.. జనసైనికులతో భేటీలు.. ఎప్పటి నుంచి అంటే?

విదేశాల్లో గ్రాడ్యుయేషన్ చదవాలనుకునే ప్రతీ విద్యార్థికి పావలా వడ్డీకే బ్యాంకు రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. అంతేకాదు.. విద్యార్థులకోసం సరికొత్త పథకాన్ని రూపొందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రం నుంచి విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు ఎలాంటి పరిమితులు లేకుండా, ఎంత మంది విద్యార్థులకైనా చదువుకునే అవకాశం కల్పించాలని సీఎం చంద్రబాబు సూచించారు.

దేశంలో ఐఐటీ, ఐఐఎం నీట్ వంటి ఉన్నత విద్య చదవాలనుకునే వారికి కూడా ఈ పథకం వర్తింప జేయాలని పేర్కొన్నారు. 4శాతం వడ్డీకే బ్యాంకు రుణాలు ఇవ్వడంతోపాటు.. దానికి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. 14ఏళ్లలో రుణాలను చెల్లించుకునే వెసులుబాటు కల్పిస్తామని తెలిపారు. మరోవైపు.. బీసీ విద్యార్థులు ఐఐటీ, నీట్‌లో కోచింగ్ కోసం రాష్ట్రంలో శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.