జగన్‌ను తిరుమలకు వెళ్లవద్దని ఎవరూ చెప్పలేదు: చంద్రబాబు కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుమల తిరుమతి పర్యటన రద్దుపై సీఎం చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుమల తిరుమతి పర్యటన రద్దుపై సీఎం చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంలో మాట్లాడారు. జగన్‌ను తిరుమలకు వెళ్లవద్దని ఎవరూ చెప్పలేదని అన్నారు. ర్యాలీలు, జనసమీకరణలు మాత్రమే చేయొద్దని చెప్పినట్లు వివరించారు.
తిరుపతిలో పోలీసు యాక్ట్ 30 అమలులో ఉందని చంద్రబాబు నాయుడు అన్నారు. ఆచారాలు పాటించకపోతే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని చెప్పారు. ఇంతకు ముందు వైఎస్ జగన్ నియమాలను ఉల్లంఘించి తిరుమలకు వెళ్లారని అన్నారు. అసలు భక్తుల మనోభావాలను దెబ్బతీసే అధికారాన్ని జగన్‌కు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు.
ఇప్పుడు తప్పులను మరోవారిపై వేసే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. రౌడీయిజం చేస్తామంటే నడవదని హెచ్చరించారు. గతంలో రూల్స్‌ను బ్రేక్ చేశారని, ఇప్పుడు కూడా అదే పని చేస్తామని అంటే ఎలా అని చంద్రబాబు నాయుడు నిలదీశారు.
జగన్ అసత్యాలను పదే పదే చెబుతున్నారని అన్నారు. నెయ్యి కల్తీ జరగలేదని, ఈవో చెప్పారని అంటున్నారని తెలిపారు. నెయ్యి కల్తీ జరిగినట్లు ఎన్డీడీబీ రిపోర్టులో స్పష్టమైందని చెప్పారు. ఏ మతానికైనా కొన్ని సంప్రదాయాలు, ఆచారాలు ఉంటాయని తెలిపారు. దేవుడి వద్దకు వెళ్లే ఎవరైనా ఆ ఆచారాలను పాటించాల్సిందేనని చెప్పారు. భక్తులు పవిత్రంగా భావించే క్షేత్రాన్ని రక్షించాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు.
జగన్ తిరుమల పర్యటన రద్దుపై ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు..