ఏపీ సీఎం చంద్రబాబు దూకుడు.. రెండో శ్వేతపత్రం రెడీ

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలుత పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శించిన చంద్రబాబు ఆ తర్వాత రాజధానిలోనూ విస్తృతంగా పర్యటించారు.

ఏపీ సీఎం చంద్రబాబు దూకుడు.. రెండో శ్వేతపత్రం రెడీ

Cm Chandrababu : అమరావతి తాజా పరిస్థితి, భవిష్యత్ కార్యాచరణపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. నిన్న సచివాలయంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ, ఆ శాఖ ఉన్నతాధికారులతో పాటు సీఆర్డీఏ కమిషనర్ తో ముఖ్యమంత్రి సమీక్షించారు. శ్వేతపత్రంలో పొందుపరచాల్సిన అంశాలపై కొన్ని సూచనలు చేశారు. కీలకమైన శాఖలు, ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న శ్వేతపత్రాల్లో ఇది రెండోది.

పోలవరం ప్రాజెక్ట్ పై ఇప్పటికే మొదటి శ్వేతపత్రం విడుదల చేసింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలుత పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శించిన చంద్రబాబు ఆ తర్వాత రాజధానిలోనూ విస్తృతంగా పర్యటించారు. రాజధాని పనులను మళ్లీ పట్టాలెక్కించేందుకు చేపట్టాల్సిన చర్యలపై కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.

రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి చేసేందుకు చంద్రబాబు నడుం కట్టారు. ఇప్పటికే నిర్మాణ పనులను పరిశీలించారు. రాజధాని నిర్మాణ పనులు ఏ స్థాయిలో ఉన్నాయి అనే దానికి సంబంధించి పూర్తి నివేదికను తెప్పించుకునే పనిలో చంద్రబాబు ఉన్నారు. ఈ నేపథ్యంలో రెండో శ్వేతపత్రంగా రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి విడుదల చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. నిన్న దీనికి సంబంధించి అధికారులతో రివ్యూ చేశారు. ఇప్పటివరకు జరిగిన పనులకు సంబంధించి వ్యవహారాలను శ్వేతపత్రంలో పొందుపరిచారు. గతంలో జరిగిన నిర్మాణాలు, పెండింగ్ లో ఉన్న పనులు, ఏయే పనులు ప్రధానంగా డ్యామేజ్ అయ్యాయి.. ఇలాంటి అంశాలను వైట్ పేపర్ లో పొందుపరిచినట్లు తెలుస్తోంది.

Also Read : తండ్రికి పూర్తి భిన్నంగా సాహస రాజకీయం.. ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న మహారాణి..!