Cm Chandrababu: రేపు కడప జిల్లాకు సీఎం చంద్రబాబు.. జమ్మలమడుగులో పర్యటన.. ఇంటింటికి వెళ్లి..

అక్కడి నుంచి మధ్యాహ్నం 3 గంటల 55 నిమిషాలకు గండికోట హెలీప్యాడ్ దగ్గరికి చేరుకుంటారు.

Cm Chandrababu: రేపు కడప జిల్లాకు సీఎం చంద్రబాబు.. జమ్మలమడుగులో పర్యటన.. ఇంటింటికి వెళ్లి..

Updated On : July 31, 2025 / 7:55 PM IST

Cm Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు రేపు కడప జిల్లాలో పర్యటించబోతున్నారు. జమ్మలమడుగు మండలంలో ఆయన పర్యటించనున్నారు. ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి విజయవాడ ఎయిర్ పోర్టుకు 10 గంటల 55 నిమిషాలకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి కడప ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.

ఇక అక్కడి నుంచి 11 గంటల 55 నిమిషాలకు హెలికాప్టర్ లో బయలుదేరి మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు జమ్మలమడుగు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 12 గంటల 25 నిమిషాలకు గూడెం చెరువు గ్రామానికి చేరుకుంటారు. అక్కడ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు పంపిణీ చేయబోతున్నారు.

12 గంటల 50 నిమిషాలకు గూడెం చెరువులోని ప్రజా వేదిక వద్దకు చేరుకుంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2.30 కు ఎల్లప్ప ఫంక్షన్ హాల్ కు చేరుకుని అక్కడ స్థానిక నేతలతో సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు. అనంతరం తిరిగి జమ్మలమడుగు హెలీప్యాడ్ దగ్గరికి చేరుకుంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 3 గంటల 55 నిమిషాలకు గండికోట హెలీప్యాడ్ దగ్గరికి చేరుకుంటారు.

Also Read: ఖాతాల్లోకి 7వేల రూపాయల డబ్బులు.. అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష.. రూ.2,342 కోట్లు కేటాయింపు..

అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సాయంత్రం గండికోటకు చేరుకుంటారు. అక్కడ ఒబెరాయ్ హోటల్, జార్జ్ వ్యూ పాయింట్ ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత 4.30 నుంచి సాయంత్రం 5.30 వరకు జరిగే స్టేక్ హోల్డర్స్, ప్రాజెక్ట్ డెవలపర్లతో సీఎం చంద్రబాబు సమావేశం కాబోతున్నారు. ఆ తర్వాత గండికోట నుంచి బయలుదేరి 5 గంటల 50 నిమిషాలకు కడప ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు ఆ తర్వాత ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకోనున్నారు సీఎం చంద్రబాబు.