Cm Chandrababu: అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం.. మెగా డీఎస్సీని సూపర్ హిట్ చేసి చూపించాం- సీఎం చంద్రబాబు

మీ కోరిక ఉద్యోగం. అది తీరింది. నా కోరిక ఈ రాష్ట్రంలో పేదరికం లేని సమాజం రావాలి. అది విద్య వల్లనే సాధ్యం. ఆ బాధ్యత మీది. సిద్ధమా.

Cm Chandrababu: అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం.. మెగా డీఎస్సీని సూపర్ హిట్ చేసి చూపించాం- సీఎం చంద్రబాబు

Updated On : September 25, 2025 / 6:55 PM IST

Cm Chandrababu: డీఎస్సీ ద్వారా కొత్తగా రిక్రూట్ అయిన టీచర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. విజేతలు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు, లోకేశ్ సమాధానాలు ఇచ్చారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రులందరూ ఎంతమంది టీచర్లను నియమించారో.. నేను ఒక్కడినే అంత మంది టీచర్లను నియమించాను అని సీఎం చంద్రబాబు చెప్పారు. విద్యా రంగాన్ని నేను ఎప్పుడూ అశ్రద్ధగా చూడలేదు, నిర్లక్ష్యం చేయలేదన్నారు. మొదటి సూపర్ సిక్స్‌ యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడం అని.. అందులో భాగంగా మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశానని చంద్రబాబు తెలిపారు.

మెగా డీఎస్సీని సూపర్ హిట్ చేశారని సీఎం చంద్రబాబు అన్నారు. మెగా డీఎస్సీని సమర్థవంతంగా నిర్వహించిన మంత్రి నారా లోకేశ్, టీంను ఆయన అభినందించారు. మగవాళ్లకంటే మహిళలే ఎక్కువగా చదువు చెప్పగలరని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఐదేళ్లు అధికారంలో ఉన్నా ఒక్క టీచర్ ను కూడా నియమించకుండానే క్వాలిటీ పెరిగిపోయిందని ప్రచారం చేశారని గత ప్రభుత్వంపై మండిపడ్డారు.

”మీ కోరిక ఉద్యోగం. అది తీరింది. నా కోరిక ఈ రాష్ట్రంలో పేదరికం లేని సమాజం రావాలి. అది విద్య వల్లనే సాధ్యం. ఆ బాధ్యత మీది. సిద్ధమా. మెగా డీఎస్సీ సాధ్యమా అన్నారు. మెగా డీఎస్సీని సూపర్‌ హిట్‌ చేసి చూపించాం. 150 రోజుల్లోనే డీఎస్సీ పూర్తి చేసిన విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ను
అభినందిస్తున్నా” అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

కొత్త రాష్ట్రం కావడంతో స్టార్టప్ లు మనకు వస్తున్నాయి, అందుకే కసితో పని చేస్తున్నామని మంత్రి నారా లోకేశ్ అన్నారు. మొదటి సూపర్ సిక్స్ మెగా డీఎస్సీ… దాన్ని సూపర్ హిట్ చేసింది కూటమి ప్రభుత్వమే అని చెప్పారు.

వెలగపూడిలోని సచివాలయం సమీపంలో మెగా డీఎస్సీ ఉత్సవ్ నిర్వహించారు. 15,941 మంది డీఎస్సీ విజేతలకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. అభ్యర్థులకు అపాయింట్ మెంట్ లెటర్లను అందజేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. డీఎస్సీకి ఎంపికైన అభ్యర్థులకు ఆయన అభినందనలు తెలిపారు.

Also Read: అసెంబ్లీలో జగన్ పై నిప్పులు చెరిగిన బాలకృష్ణ.. నాడు అవమానం జరిగినా ఎవరూ అడగలేదంటూ సీరియస్..