CM Jagan : దాసరి సుధ గెలుపు కోసం అందరూ పనిచేయాలి : సీఎం జగన్
బద్వేల్ ఉప ఎన్నికల్లో వైసీపీ తరపున దివంగత వెంకటసుబ్బయ్య సతీమణి దాసరి సుధను నిలబెడుతున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. బద్వేల్ గెలుపు బాధ్యత సమావేశానికి వచ్చిన అందరిపై ఉందన్నారు.

Jagan (1)
Badwell by-election : బద్వేల్ ఉప ఎన్నిక అభ్యర్థిగా డా.దాసరి సుధను వైసీపీ ఎంపిక చేసింది. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున గెలుపొందిన బద్వేల్ ఎమ్మెల్యే డా.దాసరి వెంకటసుబ్బయ్య అనారోగ్యంతో ఈ ఏడాది మార్చి 28న మృతి చెందడంతో ఉప ఎన్నిక జరుగబోతుంది. దీంతో డాక్టర్ వెంటకసుబ్బయ్య సతీమణి డా.సుధను పార్టీ అధిష్టానం బద్వేల్ అభ్యర్థిగా ఎంపిక చేసింది. బద్వేల్ ఉప ఎన్నికపై గురువారం తాడేపల్లిలో క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ బద్వేల్ ఉప ఎన్నికల్లో వైసీపీ తరపున దివంగత వెంకటసుబ్బయ్య సతీమణి దాసరి సుధను నిలబెడుతున్నట్లు ప్రకటించారు. బద్వేల్ నియోజకవర్గ గెలుపు బాధ్యత సమావేశానికి వచ్చిన అందరిపై ఉందన్నారు. సుధ నామినేషన్ కు అందరూ హాజరు కావాలని సూచించారు.
Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌తో సోము వీర్రాజు భేటీ, బద్వేల్ ఉప ఎన్నికపై చర్చ
గతంలో వెంకసుబ్బయ్యకు వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ డాక్టర్ సుధకి రావాలని పేర్కొన్నారు. ఎక్కడా అతి విశ్వాసం చపకుండా, ప్రజల ఆమోదాన్ని పొందాలని దిశానిర్ధేశం చేశారు. ప్రతి సామాజిక వర్గాన్ని కలుపుకుపోవాలన్నారు. ఓటింగ్ శాతం పెంచాలని సూచించారు. అందరూ ఓట్లు వేసేలా ప్రోత్సహించాలని తెలిపారు. డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడంతోపాటు ప్రభుత్వ పథకాల గురించి ప్రజల్లో చైతన్యం పెంచాలని చెప్పారు.
బద్వేల్ ఉప ఎన్నికకు పార్టీ ఇంఛార్జిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉంటారని సీఎం జగన్ స్పష్టం చేశారు. వచ్చే సోమవారం నుంచి పార్టీ తరఫున కార్యక్రమాలు మొదలుపెట్టాలని సూచించారు. తమ ప్రభుత్వం వచ్చాక ఎలాంటి మేలు చేసిందో ప్రజలకు తెలియజేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం జగన్ నిర్దేశించారు.
Badvel Bypoll : బద్వేల్ ఉపఎన్నిక.. వైసీపీ అభ్యర్థిగా సుధ
బద్వేలు ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసిన విషయం విదితమే. అక్టోబర్ 1 న ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ నెల 8 తేదీ నామినేషన్ల ప్రక్రియకు చివరి తేదీగా నిర్ణయించారు. 11న నామినేషన్ల పరిశీలన, 13న ఉపసంహరణకు గడువు నిర్ణయించారు. అక్టోబర్ 30న పోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు ఉంటుంది.