బై ద పీపుల్..ఆఫ్ ద పీపుల్ : మండలి ఛైర్మన్ తీరు బాధేస్తోంది – సీఎం జగన్

  • Published By: madhu ,Published On : January 23, 2020 / 11:00 AM IST
బై ద పీపుల్..ఆఫ్ ద పీపుల్ : మండలి ఛైర్మన్ తీరు బాధేస్తోంది – సీఎం జగన్

Updated On : January 23, 2020 / 11:00 AM IST

బై ద పీపుల్..ఆఫ్ ద పీపుల్..అన్నారు సీఎం జగన్. 2020, జనవరి 23వ తేదీ గురువారం నాలుగో రోజు శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. పలు బిల్లులకు ఆమోదం తెలిపిన అనంతరం సాయంత్రం శాసనమండలిలో జరిగిన పరిణామాలపై సభ చర్చింది. ఈ సమావేశానికి టీడీపీ దూరంగా ఉంది. వైసీపీ సభ్యులు మాట్లాడిన అనంతరం సీఎం జగన్ మాట్లాడారు..
 

ఆయన మాట్లాడుతూ…

2019 జరిగిన ఎన్నికల్లో 175 స్థానాలకు గాను..151 మంది ఎమ్మెల్యేలతో అంటే..86 శాతంతో శాసనసభ ఏర్పాటైందన్నారు. ఇది ప్రజల సభ, చట్టాలను చేయడానికి..ఏర్పాటైన సభగా అభివర్ణించారు. రివర్స్ టెండరింగ్‌కు చటబద్ధత, గ్రామ సచివాలయాలు, ఆర్టీసీ విలీనం, రెగ్యులేషన్ కమిటీ, ఇంగ్లీషు భాషలాంటి ఎన్నో బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపిందనే విషయాన్ని గుర్తు చేశారు. పాలకులం కాదు..సేవకులం..అలాగే ఉంటామని తొలి రోజు నుంచే చెబుతూ వస్తున్నామని, దీనికి కట్టుబడి ఉన్నామన్నారు. 

 

అయితే..శాసనమండలిలో జరిగిన పరిణామాలు తనను కలిచివేశాయని, సెక్షన్ బ్యాలెన్స్ అనేవి చట్టాలు, నిబంధనలు బట్టి ఉండాలన్నారు. చట్టాన్ని ఉల్లంఘించి అధికారాన్ని ఉపయోగించుకోవడం కాదని..ఇలా జరిగితే..ప్రజా స్వామ్యం ఖూనీ అయిపోతుందన్నారు. శాసనమండలి చట్టబద్ధంగా వ్యవహరిస్తుందని తాము నమ్మామని, కానీ ఐదు కోట్ల ప్రజల నమ్మకానికి వమ్ము జరిగిందన్నారు. 

శాసనమండలి ఛైర్మన్ నిష్పక్ష పాతికంగా వ్యవహరించే పరిస్థితి లేదని..బాబు ఆదేశాలను బట్టి చూస్తే తెలుస్తుందన్నారు. షరీఫ్ చేసిన ప్రసంగాన్ని రాష్ట్ర ప్రజలు చూడాలన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి..వికేంద్రీకరణకు మండలి ప్రజాస్వామ్యయుతంగా చర్చించి..ఆమోదం తెలుపవచ్చు..లేదా తిరస్కరించే అవకాశం ఉందని, సవరణలు చేయవచ్చని తెలిపారు.

 

రూల్స్ క్లియర్‌గా ఉన్నాయి..సెలెక్టివ్ కమిటీకి పంపే అవకాశం లేదని ఛైర్మన్ చెబుతూ..తనకు లేని విచక్షణా అధికారాన్ని ఉపయోగించి..డిలే చేయడానికి ఈ బిల్లును కమిటీకి పంపాలని తీసుకున్ని నిర్ణయం దుర్మార్గమన్నారు సీఎం జగన్. 

Read More : జగన్ దెబ్బకు బాబు గ్యాలరీకి పరిమితం : శాసనసమండలి ఉంచాలా ? తీసేయాలా ?