CM Jagan On Meters : కరెంటు బిల్లు అంతా ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పండి- సీఎం జగన్ కీలక ఆదేశాలు

వ్యవసాయ మోటార్లకు మీటర్లను పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించాలని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు జగన్. రైతుపై ఒక్క పైసా భారం కూడా పడదని, వ్యవసాయ మోటార్లకు కరెంటు బిల్లంతా ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలుపుతూ రైతులకు లేఖలు రాయాలని చెప్పారు.

CM Jagan On Meters : కరెంటు బిల్లు అంతా ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పండి- సీఎం జగన్ కీలక ఆదేశాలు

Cm Jagan On Meters

Updated On : July 28, 2022 / 7:10 PM IST

CM Jagan On Meters : విద్యుత్ రంగంపై తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు.

థర్మల్ పవర్ ప్లాంట్లలో సరిపడ బొగ్గు నిల్వలు ఎల్లప్పుడూ ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. ఇందుకోసం సరైన ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. విద్యుత్ డిమాండ్ అధికంగా ఉన్న రోజుల్లో పూర్తి సామర్థ్యంతో విద్యుత్ ప్లాంట్ నడిచేలా చూసుకోవాలని ఆదేశించారు జగన్. ఒప్పందాల మేరకు బొగ్గు సప్లయ్ జరిగేలా పర్యవేక్షణ చేయాలన్నారు.

CM Jagan On Meters : వ్యవసాయ మోటార్లకు మీటర్లు, సీఎం జగన్ కీలక ప్రకటన

పంపు సెట్ల కోసం రైతులు దరఖాస్తు చేసుకుంటే వెంటనే మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు జగన్. ఇక వ్యవసాయ మోటార్లకు మీటర్లను పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించాలని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. మోటర్లకు మీటర్ల బిగింపుతో కలిగే ప్రయోజనాలను వివరిస్తూ రైతులకు లేఖలు రాయాలని సూచించారు.

రైతుపై ఒక్క పైసా భారం కూడా పడదని, వ్యవసాయ మోటార్లకు కరెంటు బిల్లంతా ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలుపుతూ రైతులకు లేఖలు రాయాలని సీఎం జగన్ అన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్ల ఏర్పాటుకు సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ ఎలా విజయవంతం అయిందో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్నదాతలకు వివరించాలని అధికారులను ఆదేశించారు జగన్. 33 మిలియన్ యూనిట్లకు పైగా విద్యుత్ ఆదా జరిగిందన్న అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

మోటార్లకు మీటర్ల బిగింపుతో నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతుందని, మోటార్లు కాలిపోవనే విషయాన్ని తెలియజెప్పాలన్నారు. మరోవైపు పంపు సెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వెంటనే కనెక్షన్లు మంజూరు చేయాలన్నారు. ఎక్కడ ట్రాన్స్ ఫార్మర్ పాడైనా వెంటనే కొత్తది ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు సీఎం జగన్.