CM Jagan : పథకాలు కొనసాగాలంటే అదొక్కటే దారి- సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

ఎన్నడూ జరగని విధంగా.. 58 నెలల్లో గ్రామాల్లో అభివృద్ధి చేశాం. విప్లవాత్మక మార్పులు చేపట్టాం.

CM Jagan : పథకాలు కొనసాగాలంటే అదొక్కటే దారి- సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

CM Jagan : శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని అక్కవరంలో మేమంతా సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబుకి ఓటు వేస్తే సంక్షేమ పథకాలు అగిపోతాయని హెచ్చరించారు సీఎం జగన్. ఇప్పుడు అమలవుతున్న సంక్షేమ పథకాలన్నీ కొనసాగాలంటే.. వైసీపీకే ఓటు వేయాలని పిలుపునిచ్చారు జగన్.

”200 సీట్లు సాధించేందుకు సిద్ధమా. పథకాలు కొనసాగాలా? లేదా? జగన్ కి ఓటేస్తేనే పథకాలు కొనసాగుతాయి. చంద్రబాబుకి ఓటేస్తే అన్ని పథకాలకు ముగింపే. కురుక్షేత్రంలో మరో చరిత్రాత్మక విజయాన్ని సాధించేందుకు సిద్ధమా? కూటమి మోసాలకు చెంపచెల్లుమనేలా చెప్పేందుకు సిద్ధమా? పేదల గుండె చెప్పుడే సిద్ధం. విప్లవాత్మక మార్పులే ఈ సిద్ధం. ఎన్నడూ జరగని విధంగా.. 58 నెలల్లో గ్రామాల్లో అభివృద్ధి చేశాం. విప్లవాత్మక మార్పులు చేపట్టాం” అని సీఎం జగన్ అన్నారు.

”చంద్రబాబుకు నన్ను తిట్టడం, తిట్టించడమే పని. వైద్య ఆరోగ్య రంగంలో అనేక మార్పులు తెచ్చాం. వాలంటీర్లు ఇంటి వద్దకే వచ్చి సేవలు అందిస్తున్నారు. ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు. రూ.2లక్షల 70వేల కోట్లు నేరుగా లబ్దిదారులకు అందించాం. మీకు మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు అండగా నిలవండి. ఎన్నికలు అయిపోగానే మ్యానిఫెస్టోను చెత్తబుట్టలో వేసే సంస్కృతి చంద్రబాబుది. మేము మ్యానిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావించాం. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం.

58 నెలల్లో 2లక్షల కోట్ల సంక్షేమ పథకాలు ఇచ్చాం. మీకు మంచి జరిగి ఉంటే.. మీ బిడ్డకు సైన్యంలా నిలవండి. అనేక కుట్రలకు దిగజారుతున్నారు చంద్రబాబు. ఎలాంటి మార్పులు తీసుకొచ్చామో.. కనీసం ఆత్మవిమర్శ చేసుకున్నారా చంద్రబాబు. దోచుకోవడానికి, పంచుకోవడానికి అధికారం కావాలట. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసినా.. ఆయన చేసిన ఒక్క మంచైనా గుర్తుకు వస్తుందా? కరోనా కష్టంలో కూడా సాకులు చెప్పకుండా బటన్ నొక్కడం ఆపలేదు. మంచి చేశానన్న ఆత్మ సంతోషంతో.. మీ ముందు తలెత్తుకుని నిలబడ్డా. 2024లో కూడా అమలయ్యేవే మ్యానిఫెస్టోలో పెడతా. బాబులా అబద్దపు హామీలు ఇవ్వను.

జగన్ మార్క్.. ప్రతి ఇంట్లో.. ప్రతీ గ్రామంలో కనిపిస్తుంది. జగన్ కి పేదలపై ఉన్న ప్రేమ.. దేశంలో ఏ నాయకుడికీ లేదు, ఉండదు. జగన్ చేయలేని స్కీం లు.. చంద్రబాబు.. ఆయన బాబు కూడా చేయలేడు. బాబులా మోసపు వాగ్దానాలు చేయను. మోసాన్ని నిజాయితీతో నిరూపించడానికి నేను సిద్ధం. మీరు సిద్ధమా..” అని ముఖ్యమంత్రి జగన్ అన్నారు.

Also Read : వైసీపీ ఎన్నికల ప్రణాళికపై ఆసక్తికర చర్చ.. నవరత్నాలకు అప్‌గ్రేడెడ్‌ వెర్షన్‌గా మ్యానిఫెస్టో..?!