నా జీవితంలో మర్చిపోలేని రోజు..బతుకులు మారిపోతాయి : కడప ఉక్కు పరిశ్రమకు సీఎం జగన్ శంకుస్థాపన

దశాబ్దాల నాటి రాయలసీమ ప్రజల కల నెరవేరింది. కడప ఉక్కు పరిశ్రమకు సీఎం జగన్ సోమవారం(డిసెంబర్ 23,2019) శంకుస్థాపనం చేశారు. ఈ రోజు నా జీవితంలో మర్చిపోలేని

  • Published By: veegamteam ,Published On : December 23, 2019 / 07:15 AM IST
నా జీవితంలో మర్చిపోలేని రోజు..బతుకులు మారిపోతాయి : కడప ఉక్కు పరిశ్రమకు సీఎం జగన్ శంకుస్థాపన

Updated On : December 23, 2019 / 7:15 AM IST

దశాబ్దాల నాటి రాయలసీమ ప్రజల కల నెరవేరింది. కడప ఉక్కు పరిశ్రమకు సీఎం జగన్ సోమవారం(డిసెంబర్ 23,2019) శంకుస్థాపనం చేశారు. ఈ రోజు నా జీవితంలో మర్చిపోలేని

దశాబ్దాల నాటి రాయలసీమ ప్రజల కల నెరవేరింది. కడప ఉక్కు పరిశ్రమకు సీఎం జగన్ సోమవారం(డిసెంబర్ 23,2019) శంకుస్థాపన చేశారు. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఈ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు అని సీఎం జగన్ అన్నారు. రూ.15వేల కోట్ల పెట్టుబడితో 30లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో స్టీల్ ప్లాంట్ పెట్టామని సీఎం జగన్ చెప్పారు. మూడేళ్లలో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. ఉక్కు పరిశ్రమతో బతుకులు మారిపోతాయన్న జగన్.. ప్రత్యక్షంగా, పరోక్షంగా 25వేల మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం బడ్జెట్ లో రూ.250 కేటాయించామన్నారు. ఇప్పటికే రూ.62 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉక్కు పరిశ్రమ కట్టడం రాష్ట్ర ప్రభుత్వం పని కాకపోయినా.. ఆ బాధ్యతను తీసుకున్నామని జగన్ చెప్పారు.

కడప జిల్లాకు స్టీల్ ప్లాంట్ రావడంతో ఈ ప్రాంతం ముఖచిత్రమే మారిపోతుందని సీఎం జగన్ నమ్మకం వ్యక్తం చేశారు. ఉక్కు పరిశ్రమకు ముడి సరుకు సరఫరా చేసేందుకు కేంద్రం అంగీకరించింది అని తెలిపిన సీఎం జగన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు కృతజ్ఞతలు తెలిపారు. కడపకు, రాయలసీమకు మళ్లీ న్యాయం జరిగే రోజులు వచ్చాయని సీఎం జగన్ ఆనందం వ్యక్తం చేశారు. 2030 నాటికి దేశానికి 3 కోట్ల టన్నుల ఉక్కు అవసరం అని జగన్ చెప్పారు. ఉక్రు పరిశ్రమ ఏపీ ప్రజల హక్కు అన్నారు.

గత ప్రభుత్వం, ఇప్పటి ప్రభుత్వం పాలనలో ఉన్న తేడాలను ప్రజలు గమనించాలని సీఎం జగన్ కోరారు. ఎన్నికలకు 6 నెలల ముందు కడప స్టీల్ ఫ్యాక్టరీకి టెంకాయ కొట్టి చంద్రబాబు మోసం చేస్తే.. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో తాను స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశానని.. చిత్తశుద్ధి అంటే తనదని సీఎం జగన్ అన్నారు. రాయలసీమకు మంచి జరగాలంటే నీళ్లు, పరిశ్రమలు, ఉద్యోగాలు రావాలన్నారు.

కాగా, కడప స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేయడం ఇది మూడోసారి. 2007లో మొదటి సారి వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. 2018లో చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఇప్పుడు సీఎం జగన్ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది.

సీఎం జగన్ కామెంట్స్:
* కడప స్టీల్ ప్లాంట్ కు సీఎం జగన్ శంకుస్థాపన
* జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన
* మూడేళ్లలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేస్తాం
* రూ.15వేల కోట్లతో స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టాం
* ఎన్నికలకు 6 నెలల ముందు చంద్రబాబు స్టీల్ ప్లాంట్ కు టెంకాయ కొట్టారు.. ఇది మోసం కాదా..
* ఎన్నో ఏళ్ల స్టీల్ ప్లాంట్ కలను సాకారం చేశాం
* గత ప్రభుత్వ పాలనకు, మా పాలనకు తేడా ఇదే
* అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన
* రాయలసీమ అభివృద్ధికి, ఉద్యోగాల కల్పనకు ముందడుగు వేశాం
* ఏడాదికి 5 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తి