CRDA రద్దుకు రంగం సిద్ధం : హైపవర్ కమిటీ భేటీలో చర్చ

హైపవర్ కమిటీ భేటీ కొనసాగుతోంది. 2020, జనవరి 17వ తేదీ శుక్రవారం తాడేపల్లిగూడెంలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. కీలక అంశాలపై చర్చిస్తున్నారు. గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది. CRDA రద్దుకు యోచిస్తోందని తెలుస్తోంది. పాలనా వికేంద్రీకరణకే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. హైపవర్ కమిటీ సూచిస్తే..సచివాలయ ఉద్యోగుల తరలింపు ప్రక్రియ కసరత్తు జరుపుతోంది.
కమిటీ తుది నివేదికను ఈనెల 20న ప్రభుత్వానికి సమర్పించే ఛాన్సుంది. అదే రోజు జరిగే అసెంబ్లీ సమావేశంలో ఏపీలో పరిపాలనా వికేంద్రీకరణ, రాజధానుల అంశంపై విస్తృతంగా చర్చ జరిగే అవకాశముంది. ఈ సమావేశాల్లోనే బిల్లును పాస్ చేయించాలనే యోచనలో ఉంది వైసీపీ ప్రభుత్వం.
రైతుల్లో ఎక్కువ మంది భూములు వెనక్కి తీసుకొనేందుకు నిరాకరిస్తున్నందున.. అమరావతి ప్రాంతాన్ని ఇండస్ట్రియల్, ఎడ్యుకేషనల్, మెడికల్ జోన్‌గా అభివృద్ధి చేయాలని.. తద్వారా అమరావతి వాసులకు ఉద్యోగం, ఉపాధి కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. రాజధాని రైతులు తమ అభిప్రాయాలు చెప్పుకోవాలని ప్రభుత్వం విధించిన గడువు శుక్రవారంతో ముగుస్తోంది.
Read More : హైపవర్ మీటింగ్ : రాజధాని రైతులకు మేలు చేస్తాం – బోత్స