శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం జగన్‌, శివలింగానికి అభిషేకం

ఏపీ సీఎం జగన్ మహా శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నారు. గురువారం(మార్చి 11,2021) కృష్ణా జిల్లా గుడివాడలో పర్యటించిన సీఎం జగన్, పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ స్టేడియంలో నిర్వహిస్తున్న మహా శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఉదయం 11.30కు స్టేడియానికి చేరుకున్న సీఎం జగన్‌.. అభిషేకం, పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు.

శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం జగన్‌, శివలింగానికి అభిషేకం

Updated On : March 11, 2021 / 1:15 PM IST

cm jagan participates in maha shivaratri celebrations: ఏపీ సీఎం జగన్ మహా శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నారు. గురువారం(మార్చి 11,2021) కృష్ణా జిల్లా గుడివాడలో పర్యటించిన సీఎం జగన్, పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ స్టేడియంలో నిర్వహిస్తున్న మహా శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఉదయం 11.30కు స్టేడియానికి చేరుకున్న సీఎం జగన్‌.. అభిషేకం, పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు.

సీఎం జగన్ సంప్రదాయ దుస్తుల్లో వచ్చారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని శివలింగానికి అభిషేకం చేశారు. శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామునే భక్తులు ఆలయాలకు క్యూ కట్టారు.