CM Jagan : లండన్ పర్యటన ముగించుకుని గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న సీఎం జగన్
సీఎం జగన్ కు మంత్రులు జోగి రమేష్, విశ్వరూప్, డీజీపీ, సీఎస్, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు స్వాగతం పలికారు. 10 రోజులపాటు లండన్ లో పర్యటించారు.

CM Jagan (4)
CM Jagan Reached Gannavaram Airport : ఏపీ సీఎం జగన్ విదేశీ పర్యటన ముగిసింది. జగన్ దంపతులు రాష్ట్రానికి చేరుకున్నారు. పది రోజుల లండన్ టూర్ ముగించుకుని రాష్ట్రానికి వచ్చారు. ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. సీఎం జగన్ కు మంత్రులు జోగి రమేష్, విశ్వరూప్, డీజీపీ, సీఎస్, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు స్వాగతం పలికారు.
సీఎం జగన్ 10 రోజులపాటు లండన్ లో పర్యటించారు. విదేశీ పర్యటన ముగించుకుని కాసేపటి క్రితం గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
రామవరప్పాడు రింగ్ రోడ్డులో సీఎం జగన్ కు పార్టీ నేతలు స్వాగతం ఏర్పాట్లు చేశారు. సీఎం జగన్ తాడేపల్లి నివాసానికి బయలుదేరారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులపై నేడు సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో శాంతి భద్రతలు వంటి అంశాలపై చర్చించనున్నారు.