భీమవరం సభలో పవన్ కళ్యాణ్‌పై సీఎం జగన్ విసుర్లు

భీమవరం సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దత్తపుత్రుడు ఓ త్యాగాల త్యాగరాజు అంటూ సెటైర్లు వేశారు.

భీమవరం సభలో పవన్ కళ్యాణ్‌పై సీఎం జగన్ విసుర్లు

CM Jagan Sataires on Pawan Kalyan in Bhimavaram Meeting

Updated On : December 29, 2023 / 2:03 PM IST

CM Jagan: చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయడానికే పార్టీ పెట్టారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో విద్యాదీవెన నిధుల విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్ ప్రసంగిస్తూ.. పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దత్తపుత్రుడిని భీమవరం ప్రజలు తిరస్కరించారని.. ఆయన ఇల్లు పక్క రాష్ట్రంలో ఉందని ఎద్దేవా చేశారు. ప్యాకేజీ కోసం త్యాగాలు చేసే వ్యక్తిని ఎక్కడా చూడలేదని.. ఇలాంటి వారికి ఓటు వేయడం ధర్మమేనా అని ప్రశ్నించారు.

చంద్రబాబు కోసమే దత్తపుత్రుడు జీవిస్తున్నాడని.. దత్తపుత్రుడు ఓ త్యాగాల త్యాగరాజు అంటూ సెటైర్లు వేశారు. ప్యాకేజ్ స్టార్ మహిళలను ఆట వస్తువులుగానే చూస్తాడని, నాలుగేళ్లకొకసారి భార్యలను మార్చాడని ధ్వజమెత్తారు. వివాహ బంధాన్ని గౌరవించడడు కానీ, చంద్రబాబుతో బంధం మాత్రం 15 ఏళ్లు ఉండాలి దత్తపుత్రుడు కోరుకుంటున్నాడని అన్నారు. రెండు విషాలు కలిస్తే అమృతం తయారవుందా? నలుగురు వంచకులు కలిస్తే జనానికి మంచిస్తారా అనేది ఆలోచించాలని ప్రజలను కోరారు. ఇలాంటి వారిని ఇన్పిపిరేషన్ గా తీసుకుంటే ఆడబిడ్డల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

Also Read: అన్నా రాంబాబు, మాగుంట మధ్య దూరం ఎందుకు పెరిగింది.. విభేదాలకు కారణమేంటి?

సినిమా హీరోను ఓడించిన రియల్ హీరో శీనన్న
భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పై సీఎం జగన్ ప్రశంసలు కురిపించారు. సినిమా హీరోను ఓడించిన రియల్ హీరో శీనన్న అంటూ కితాబిచ్చారు. తనకు మంత్రి పదవి ఇవ్వకపోయినా ఫర్వాలేదు కానీ భీమవరాన్ని జిల్లా హెడ్ క్వార్టర్ కావాలని గ్రంధి శ్రీనివాస్ అడిగిన విషయాన్ని ఈ సందర్భంగా వెల్లడించారు. భీమవరం అభివృద్ధికి అవసరమైన నిధులను మంజూరు చేస్తున్నట్టు సీఎం జగన్ ప్రకటించారు.