ఆశీర్వదించండి : రాక్షసులతో యుద్ధం చేస్తున్నాం – సీఎం జగన్

  • Published By: madhu ,Published On : February 24, 2020 / 11:04 AM IST
ఆశీర్వదించండి : రాక్షసులతో యుద్ధం చేస్తున్నాం – సీఎం జగన్

Updated On : February 24, 2020 / 11:04 AM IST

ఏపీ రాష్ట్రంలో రాక్షసులతో యుద్ధం చేస్తున్నాం..తప్పు చేయకపోయినా..ఏదోదో జరిగిపోయినట్లుగా..వార్తలు..ఛానెళ్లు చూపిస్తున్నాయి..యుద్ధం చేస్తున్నది ప్రతిపక్షంతో కాదు..ఉన్మాదులతో యుద్ధం చేస్తున్నాం…ఇలాంటి చోట..ప్రజల దీవెనలు కావాలన్నారు సీఎం జగన్. 2020, ఫిబ్రవరి 24వ తేదీ సోమవారం సీఎం జగన్..విజయనగరం జిల్లాకు వచ్చారు. అయోధ్య మైదానంలో ‘జగనన్న వసతి దీవెన’ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. 

కొన్ని రోజులుగా విమర్శలు చేస్తున్న వారిని ఆయన తూర్పారబట్టారు. ప్రభుత్వంపై విమర్శలు చేసే వారిని ఏమనాలో ఆలోచించుకోవాలని ప్రజలకు సూచించారు. ప్రజలు చిత్తుగా ఓడించారు కాబట్టి..రాష్ట్రంలో పరిశ్రమలు తరలివెళ్లిపోవాలని పత్రికలకు డబ్బులు ఇచ్చి రాయిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు సమన్యాయం చేయడానికి వీలు లేదని..దాడులు చేస్తున్న మూకలను ఏమనాలి ? అని ప్రశ్నించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 25 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తా ఉంటే..తప్పుడు వార్తలు రాస్తున్న పత్రికలు, ఛానెళ్లను ఏమి అనాలి అని సూటిగా ప్రశ్నించారు.

అన్యాయమైన పరిస్థితులు ఉన్నా..ప్రజలు ఇచ్చిన బలం..దేవుడి దయతో ముందడగు వేస్తామని సీఎం జగన్ వెల్లడించారు. కొన్ని రోజులుగా…ప్రతిపక్ష పార్టీ..టీడీపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. మూడు రాజధానుల ప్రకటన, కియా పరిశ్రమ తరలిపోతుంది..ఇతరత్రా అంశాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. రాజధాని ప్రాంతంలో ఇంకా ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. ఇటీవలే వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌పై దాడి చేయడం సంచలనం రేకేత్తించింది. అమరావతి జేఏసీ ముసుగులో తనపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని ఎంపీ సురేష్ ఆరోపించారు. ప్రస్తుతం సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. 

Read More>>ట్రంప్ ఇండియా టూర్..వర్మ సెటైర్లు