ఎస్వీబీసీలో పోర్న్ లింక్ వివాదంపై సీఎం జగన్ సీరియస్

cm jagan svbc: చిత్తూరు జిల్లా తిరుపతి పర్యటనలో ఉన్న సీఎం జగన్, ఎస్వీబీసీలో పోర్న్ లింక్ వివాదంపై ఆరా తీశారు. తిరుపతి ఎయిర్ పోర్టులో టీటీడీ ఉన్నతాధికారులతో సీఎం జగన్ మాట్లాడారు. పోర్న్ లింక్ వ్యవహారంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను జగన్ ఆదేశించారు. ఎస్వీబీసీని వెంటనే ప్రక్షాళన చేయాలని, ఆధ్యాత్మిక చింతనతో శ్రీవారి విశిష్టను వివరించేలా, పెంపొందించేలా కార్యక్రమాలు ప్రసారం చేయాలని, ఉండాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్.
శతమానం భవతి లింక్ బదులు పోర్న్ లింక్:
టీటీడీకి చెందిన శ్రీ వేకంటేశ్వర భక్తి చానల్(ఎస్వీబీసీ) లో పోర్న్ లింక్ వ్యవహారం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌లో వెంకట క్రిష్ణ అనే భక్తుడు శతమానం భవతి కార్యక్రమానికి సంబంధించిన వివరాలను మెయిల్ ద్వారా కోరారు. అందుకు స్పందించిన ఎస్వీబీసీ ఉద్యోగి ఒకరు… భక్తుడికి శతమానం భవతి కార్యక్రమానికి సంబంధించిన లింక్ కాకుండా.. పోర్న్ వెబ్‌సైట్ కి సంబంధించిన లింక్ పంపించాడు. దీంతో షాక్ తిన్న భక్తుడు వెంటనే టీటీడీ చైర్మన్, ఈవోలకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై స్పందించిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి విచారణకు ఆదేశించారు.