AP Politics : కాపు ఓట్ల కోసం వైసీపీ, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా టీడీపీ అడుగులు.. ఎవరి వ్యూహం ఫలిస్తుందో..!

ఎన్నికల దిశగా అధికార, విపక్షాలు రకరకాల వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఎవరి వ్యూహం ఫలిస్తుందో చూడాలి.

AP Politics : కాపు ఓట్ల కోసం వైసీపీ, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా టీడీపీ అడుగులు.. ఎవరి వ్యూహం ఫలిస్తుందో..!

YS Jagan Vs Chandrababu Naidu

AP Politics : ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఇటు రాష్ట్రంలోనూ అటు ఢిల్లీలోనూ కీలక అడుగులు పడ్డాయి. వచ్చే ఎన్నికల్లో మరోసారి నెగ్గాలన్న టార్గెట్ తో అధికార వైసీపీ చురుగ్గా పావులు కదుపుతోంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను కలిసి పార్టీలోకి ఆహ్వానించారు వైసీపీ ఎంపీ, ఉభయగోదావరి జిల్లాల సమన్వయకర్త మిథున్ రెడ్డి. అటు ఢిల్లీ వేదికగా టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు దిశగా అడుగులు కూడా పడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అంశంపై చర్చించేందుకు దేశ రాజధాని హస్తినకు వెళ్లారు చంద్రబాబు. కాసేపట్లో బీజేపీ జాతీయ నాయకులతో చర్చించబోతున్నారు.

ఇక జనసేనాని పవన్ కల్యాణ్ కూడా కాసేపట్లో ఢిల్లీకి చేరబోతున్నారు. ఇదే సమయంలో తనకు సలహాలు ఇచ్చిన వారంతా వైసీపీలో చేరుతున్నారని కాపు నేతలను ఉద్దేశించి సెటైర్లు వేస్తూ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నారు పవన్ కల్యాణ్. మొత్తంగా ఏపీ రాజకీయపై ఇవాళ ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ-జనసేన కూటమితో బీజేపీ కూడా చేరితే ఆ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయనుంది? ఏయే నియోజకవర్గాలు కేటాయిస్తారు? అన్నది ఉత్కంఠ రేపుతోంది.

మరోవైపు ప్రతిపక్ష కూటమితో బీజేపీ చేరితే అధికార వైసీపీ స్పందన ఏంటన్నది ఆసక్తికరంగా మారుతోంది. మొత్తంగా ఎన్నికల దిశగా అధికార, విపక్షాలు రకరకాల వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఎవరి వ్యూహం ఫలిస్తుందో చూడాలి. ఏపీ తాజా రాజకీయ పరిణామాలపై ప్రైమ్ టైమ్ డిబేట్..

Also Read : పొత్తు పొడిచేనా? టీడీపీ-జనసేన, బీజేపీ పొత్తులపై తెలకపల్లి రవి విశ్లేషణ

పూర్తి వివరాలు..