KCR key decision : ధాన్యం కొనుగోలుపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం
తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గతేడాది లాగే ఈసారి కూడా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

Kcr
CM KCR key decision on grain purchase : తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గతేడాది లాగే ఈసారి కూడా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కొనుగోళ్ల కోసం పౌరసరఫరాల సంస్థకు అవసరమైన 20వేల కోట్లకు బ్యాంకు పూచీకత్తు ప్రభుత్వమే ఇవ్వనున్నట్టు సీఎం వెల్లడించారు. వానాకాలం వరిపంట కొనుగోలుపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.
యాసంగిలో వచ్చే వరి ధాన్యాన్ని 6వేల 408 కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వమే పూర్తిగా కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నందున ఈసారి కూడా గ్రామాల్లోనే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు.
తెలంగాణలో పండే పత్తికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్న సీఎం.. వచ్చే వానాకాలం సుమారు 80 లక్షల ఎకరాల్లో పత్తి పండించడానికి సిద్ధం కావాలని కోరారు. ఆహార ధాన్యాల నిల్వల కోసం అదనపు గోడౌన్లు నిర్మించేందుకు స్థలాలను లీజుకు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం ఆదేశించారు.