CM Jagan: రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు -సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలందరికీ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి‌ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

CM Jagan: రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు -సీఎం జగన్

Cm Jagan Jobs

Updated On : November 3, 2021 / 3:40 PM IST

CM Jagan: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలందరికీ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి‌ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి ప్రజల జీవితాల్లో కోటి కాంతులు నింపాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా.. చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, దుష్ట శక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి ప్రతీ ఇంటా ఆనందాలను, సిరులను కురిపించాలని కోరుకున్నారు.

తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని, ప్రతి ఇంటా ఆనంద దీపాలు వెలగాలని సీఎం వైఎస్‌ జగన్‌ అభిలషించారు.