Prakasam Crime : మద్యం మత్తులో యువకుడి ప్రాణం తీసిన కానిస్టేబుల్

మద్యం మత్తులో బైక్ నడిపి ఓ యువకుడి ప్రాణం తీశాడు కానిస్టేబుల్.. ఈ ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది.

Prakasam Crime : మద్యం మత్తులో యువకుడి ప్రాణం తీసిన కానిస్టేబుల్

Prakasam Crime

Updated On : December 30, 2021 / 11:37 AM IST

Prakasam Crime : మద్యం మత్తులో పోలీస్ కానిస్టేబుల్ ఓ వ్యక్తి ప్రాణం తీశాడు. ఈ ఘటన ఒంగోలు జిల్లాలో చోటుచేసుకుంది. ఉలవపాడు వెళ్లే రహదారిపై దినేష్ అనే యువకుడు రోడ్డు దాటుతుండగా.. మద్యం మత్తులో బులెట్ బైక్‌పై వచ్చిన ఏఆర్ కానిస్టేబుల్ శివకృష్ణ అతడిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో దినేష్‌కు తీవ్ర గాయాలు కావడంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దినేష్ ప్రాణాలు కోల్పోయాడు. ఇక మద్యం తాగి బండి నడిపిన కానిస్టేబుల్‌ను స్థానికులు చితకబాదారు. అతడికి గాయాలు కావడంతో పోలీసులు శివకృష్ణను ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

 

Also Read : Anantapur Crime : అనంతలో రోడ్డు ప్రమాదం.. నీటమునిగి వ్యక్తి మృతి