హైదరాబాద్ నుంచి తరలిరావాల్సిందేమీలేదు : చంద్రబాబు

విజయవాడ : హైకోర్టు తర్వాత హైదరాబాద్ నుంచి తరలిరావాల్సిందేమీలేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. 60 ఏళ్లు హైదరాబాద్ లో ఉన్నామని తెలిపారు. ఏపీ హైకోర్టు తొలి తాత్కాలిక చీఫ్ జస్టిస్ గా సి.ప్రవీణ్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ నరసింహన్ ప్రవీణ్ కుమార్ తోపాటు మిగిలిన జడ్జీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎం చంద్రబాబుతోపాటు సుప్రీంకోర్టు జడ్జీ ఎన్వీరమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ హైకోర్టును దేశంలో అత్యున్నతంగా తీర్చిదిద్దుకోవాలన్నారు. ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఉన్నా పరిష్కరిస్తామని చెప్పారు.