ఏపీలో కరోనా భయం : 23 మందిలో వైరస్ లక్షణాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఫీవర్ నెలకొంది. రోజు రోజుకు కేసుల సంఖ్య అధికమౌతుండడం ఆందోళన వ్యక్తమౌతోంది. మొదటలో ఈ సంఖ్య తక్కువగా ఉండేది. కానీ వైరస్ విస్తృతంగా వ్యాపిస్తుండడం, కాంటాక్ట్ కేసులు ఎక్కువ కావడంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. తగిన చర్యలు తీసుకొంటోంది. 2020, మార్చి 30వ తేదీ సోమవారం మరో రెండు కేసులు రిజిష్టర్ అయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 23కి చేరుకున్నాయి.
ఈ మేరకు ప్రభుత్వం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. కాకినాడలో ఒకరు, రాజమండ్రిలో ఒకరికి కరోనా వైరస్ సోకింది. రాజమండ్రిలో సోకిన వ్యక్తికి 72 ఏళ్లుంటాయి. ఇతను ఢిల్లీ జరిగిన ఓ ప్రార్థనల్లో పాల్గొని వచ్చారని అధికారులు నిర్ధారించారు. దీంతో ఇతను ఎవరెవరితో కాంటాక్ట్ అయ్యాడు ? ఎక్కడ తిరిగాడు ? అనే దానిపై పోలీసులు, అధికారులు ఆరా తీస్తున్నారు. వీరి కుటుంబసభ్యులను..ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. లాక్ డౌన్ మరింత కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేసింది. ఏదైనా ఎమర్జెన్సీ వస్తే నాలుగు చోట్ల ఐసోలేషన్ బెడ్స్ ఏర్పాటు చేశారు. 23 కేసులు నమోదు కావడం..సీఎం జగన్ ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Also Read | తెలంగాణలో లాక్‌డౌన్ 15న ఎత్తేసే చాన్స్ లేదు – కేసీఆర్