Corona Rules : ఢిల్లీకి వెళుతున్నారా..క్వారంటైన్ లో ఉండాల్సిందే..నిబంధనలు తెలుసుకొండి

మీరు తెలుగు రాష్ట్రాల వాసులా ? ఢిల్లీ వెళుతున్నారా..అయితే అక్కడ క్వారంటైన్‌లో ఉండాల్సిందే.

Corona Rules : ఢిల్లీకి వెళుతున్నారా..క్వారంటైన్ లో ఉండాల్సిందే..నిబంధనలు తెలుసుకొండి

Delhi

Updated On : May 10, 2021 / 6:30 PM IST

 Telugu States : మీరు తెలుగు రాష్ట్రాల వాసులా ? ఢిల్లీ వెళుతున్నారా..అయితే అక్కడ క్వారంటైన్‌లో ఉండాల్సిందే. తెలంగాణ, ఏపీ రాష్ట్రం నుంచి ఢిల్లీకి వచ్చే వాళ్లు..14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది. రెండు డోసు టీకా తీసుకున్న వారు..ఏడు రోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉండాలని స్పష్టం చేసింది.

ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ చేసింది. అందులో పలు సూచనలు చేసింది. ప్రయాణానికి ముందు 72 గంటల ముందు..చేయించుకున్న కరోనా ఆర్టీపీసీఆర్ టెస్టులో నెగటివ్ వచ్చిన వారు..ఏడు రోజుల పాటు హోం క్వారంటైన్ తప్పనిసరి అని వెల్లడించింది. కరోనా ఆంక్షలు తెలుసుకుని.. ఢిల్లీకి వెళ్లాలని రైల్వే శాఖ సూచించింది.

తెలుగు రాష్ట్రాల్లో కరోనా N440K వేరియంట్ బయటపడినట్లు ప్రచారం జరగడంతో ఢిల్లీ ప్రభుత్వం క్వారంటైన్ నిబంధనలు వెల్లడించింది. దీంతో రైల్వే శాఖ ఈ మేరకు ప్రకటనలు జారీ చేసింది. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వెళ్ళే ప్రయాణీకులు కరోనా పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. నెగెటివ్ వచ్చిన సర్టిఫికేట్ తప్పనిసరిగా ప్రయాణ సమయంలో తమతో తీసుకువెళ్ళాల్సి ఉంటుంది.

Read More : అసోం 15వ సీఎంగా హిమంత బిశ్వ శర్మ ప్రమాణం