ఫోన్ చేయండి..ఇంటి వద్దకే సరుకులు : ఈ జాగ్రత్తలు పాటించండి

  • Published By: madhu ,Published On : March 28, 2020 / 03:06 AM IST
ఫోన్ చేయండి..ఇంటి వద్దకే సరుకులు : ఈ జాగ్రత్తలు పాటించండి

Updated On : March 28, 2020 / 3:06 AM IST

భారతదేశమంతా లాక్ డౌన్..పలు ఆంక్షలు..దీంతో ప్రజలు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముందుగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. వారికి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు నడుం బిగించాయి. ప్రధానంగా నిత్యావసర సరకులపై దృష్టి సారించింది. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసింది.
 

రాష్ట్రంలో నిత్యావసర సరకుల కొనుగోళ్లపై ఆంక్షలు విధించింది ఏపీ ప్రభుత్వం. మధ్యాహ్నం 1 గంటలోపే సరుకులను కొనుక్కోవాలని ఆదేశించింది. ప్రజలు గుమికూడా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పింది. కానీ కొంతమంది దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం గ్రహించింది. నిత్యావసర సరుకులను సూపర్ మార్కెట్ల నుంచి నేరుగా వినియోగదారుల ఇళ్లకే సరఫరా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఒక్క ఫోన్ చేయండి..
ఒక్క ఫోన్ చేస్తే చాలు అని తెలిపింది. సూపర్ మార్కెట్ల వద్ద ప్రజలు గుమికూడా ఉండేందుకు ఈ ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడించింది. ముందుగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టింది. దీని తర్వాత మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో ఈ విధానాన్ని తేనున్నట్లు అమల్లోకి తెచ్చారు. ఈ మేరకు సూపర్ మార్కెట్ల యాజమాన్యాలతో చర్చించారు.

రూ. 1000 సరుకులు ఆర్డర్ ఇస్తేనే..
డీ మార్ట్, బిగ్ బజార్, రిలయెన్స్ మార్ట్, బెస్ట్ ప్రైస్, స్పెన్సర్, మోడర్న్ సూపర్ మార్కెట్..ఇలా పలు సూపర్ మార్కెట్ల వివరాలతో ప్రకటనలు ఇచ్చారు. వినియోగదారులు తమకు కావాల్సిన సరుకుల వివరాలు, తమ చిరునామాను ఆ సూపర్ మార్కెట్ల వాట్సాప్ నంబర్లకు పంపి ఫోన్ చేస్తే చాలని వెల్లడించింది. ఇక్కడో ఓ కండీషన్ పెట్టింది. రూ. వెయ్యి విలువైన సరుకులు కొంటేనే ఇంటికి సరుకులు సరఫరా చేస్తారు. సరుకులు ఇంటికి చేరాకే..నగదు చెల్లించే వెసులుబాటును కల్సించారు.  

డోర్ డెలివరీ..
విజయవాడలో మొదటి రెండు రోజుల్లోనే 5 వేల ఇళ్లు, విశాఖలో 8 వేల ఇళ్లకు సరుకులను డోల్ డెలీవరి చేశారని అధికారులు తెలిపారు. కాకినాడ, రాజమహేంద్రవరంలలో మార్చి 26వ తేదీ గురువారం నుంచి ప్రారంభం కాగా…ఫస్ట్ డే 2 వేల చొప్పున సరుకులను డోరో డెలివరీ చేశారు. ఇబ్బంది లేకుండా మార్కెట్ల నుంచి ఇళ్లకే నేరుగా సరుకులు పంపించడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అనుమానాలొద్దు..
అయితే..ఇక్కడ ఓ డౌట్ రావొచ్చు. కరోనా వ్యాప్తి చెందుతున్న క్రమంలో..సరుకులు బాగానే ఉంటాయా ? డోర్ డెలివరీ చేసే వారు తగిన జాగ్రత్తలు తీసుకుంటారా అనే అనుమానాలు రావడం సహజమే. కానీ అలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని అంటున్నారు అధికారులు. వైద్యుల సూచనల మేరకు..తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతోందని, డోర్ డెలివరీ సిబ్బంది మాస్కులు ధరించడంతో పాటు..చేతికి ప్రతి గంటకు శానిటైజర్లు రాసుకుంటూ..సోషల్ డిస్టెన్ పాటిస్తున్నారని సూపర్ మార్కెట్ల యజమానులు వెల్లడిస్తున్నారు.

వినియోగదారులు ఏం చేయాలంటే..
సూపర్ బజార్ల నుంచి సరుకులు ఇంటికి రాగానే..వెంటనే సర్దుకోవద్దని సూచిస్తున్నారు వైద్యులు. సుమారు 7 నుంచి 8 గంటల పాటు ఎండలో పెట్టాలని చెబుతున్నారు. తర్వాతే..డబ్బాల్లో వేసుకోవాలని సూచిస్తున్నారు. ఖాళీ కవర్లను ఇంట్లో ఉంచకుండా..డస్ట్ బిన్ లలో వేయాలని అంటున్నారు. 
 

Also Read |  కొత్త టెక్నాలజీ : మొబైల్ ఐసీయూ లు ఆవిష్కరణ