విజయవాడలో కరోనా బాధితుడి సెల్పీ వీడియో, ప్రభుత్వాన్ని ఏమని కోరాడంటే

విజయవాడలో కరోనా సోకిన వ్యక్తి సెల్పీ వీడియో విడుదల చేశాడు. కరోనాను ఎదుర్కొనేందుకు తనకు మద్దతివ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. తన కుటుంబాన్ని ఇబ్బంది

  • Published By: veegamteam ,Published On : March 22, 2020 / 07:37 AM IST
విజయవాడలో కరోనా బాధితుడి సెల్పీ వీడియో, ప్రభుత్వాన్ని ఏమని కోరాడంటే

Updated On : March 22, 2020 / 7:37 AM IST

విజయవాడలో కరోనా సోకిన వ్యక్తి సెల్పీ వీడియో విడుదల చేశాడు. కరోనాను ఎదుర్కొనేందుకు తనకు మద్దతివ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. తన కుటుంబాన్ని ఇబ్బంది

విజయవాడలో కరోనా సోకిన వ్యక్తి సెల్పీ వీడియో విడుదల చేశాడు. కరోనాను ఎదుర్కొనేందుకు తనకు మద్దతివ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టొద్దని కోరాడు. 

బాధితుడు సెల్పీ వీడియోలో ఏమని రిక్వెస్ట్ చేశాడంటే..
అందరికి నమస్కారం, నా పేరు హేమంత్. వయసు 24 ఏళ్లు. నేను ప్యారిస్ నుంచి వచ్చాను. నేను విద్యార్థిని. మార్చి 16న ఉదయం 9గంటలకు ప్లేన్ లో ఢిల్లీ వచ్చాను. ఢిల్లీలో స్క్రీనింగ్ జరిగింది. అప్పుడు ఎటువంటి లక్షణాలు కనిపించ లేదు. దీంతో నన్ను పంపేశారు. మార్చి 17న హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ లో ప్రైవేట్ క్యాబ్ లో నేను ఒక్కడినే జర్నీ చేశాను. మధ్యాహ్నం 12కి బయలు దేరితే సాయంత్రం 6 గంటలకు ఇంట్లో ఉన్నాను. తర్వాత మున్సిపల్ విజిలెన్స్ టీమ్ మా ఇంటికి వచ్చింది. 14రోజుల పాటు ఇంట్లోనే క్వారంటైన్ లో ఉండాలని నాతో చెప్పారు. వాళ్లని గౌరవించి ఇంట్లోనే ఉన్నా. ఎక్కడికీ వెళ్లలేదు. కరోనా లక్షణాలు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని చెప్పారు. ఆ తర్వాత నాకు ఫీవర్ వచ్చింది. దీంతో స్వయంగా నేనే ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా అధికారులకు ఫోన్ చేసి చెప్పాను. టెస్టు చేయించుకుంటే నాకు పాజిటివ్ అని వచ్చింది. ప్రస్తుతం మెడికేషన్ లో ఉన్నాను. మీరు నన్ను సపోర్ట్ చేయండి. అంతేకాని నన్ను, నా కుటుంబాన్ని ఎమోషనల్ గా బ్లేమ్ చేయొద్దు. దయచేసి నాకు సపోర్ట్ చేయండి. నేను త్వరగా రికవర్ అయ్యి బయటకు వచ్చి చాలామందికి మోటివేషన్ గా ఉండాలని కోరుకుంటున్నా” అని సెల్ఫీ వీడియోలో రిక్వెస్ట్ చేశాడు. కరోనా బాధితుడి సెల్ఫీ వీడియో వైరల్ గా మారింది.

యువకుడికి కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. యువకుడు విజయవాడ వచ్చిన రెండు రోజుల తర్వాత కరోనా లక్షణాలు బయటపడ్డాయి. విజయవాడ వచ్చాక అతడు ఎవరెవరిని కలిశాడు, ఏయే ప్రాంతాలకు వెళ్లాడు, ఎంత మందితో మాట్లాడాడు, ఎంత మందితో కరచాలనం చేశాడు అనే వివరాలు ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా బాధితుడి కుటుంబసభ్యులు 500మంది వివరాలు సేకరించారు. వారంతా ప్రస్తుతం నార్మల్ గానే ఉన్నట్టు గుర్తించారు. అయినప్పటికి ముందు జాగ్రత్తగా వారి రక్త నమూనాలు సేకరించి ల్యాబ్ కి పంపారు అధికారులు. అలాగే బాధితుడిని తీసుకొచ్చిన క్యాబ్ డ్రైవర్ వివరాలు కూడా సేకరించే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఆ డ్రైవర్ ని గుర్తించిన అధికారులు అతడికి ఫోన్ చేసి మాట్లాడారు. అతడు మాములుగానే ఉన్నట్టు నిర్ధారించారు. బాధితుడు నివాసం ఉండే బెజవాడ పాతబస్తీ ప్రాంతంలో సైతం అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు.