అమెరికా నుంచి వచ్చిన యువకుడికి కరోనా…ఏపీలో 10కి పెరిగిన కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇవాళ మరో రెండు కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పదికి చేరింది.

  • Published By: veegamteam ,Published On : March 25, 2020 / 05:39 PM IST
అమెరికా నుంచి వచ్చిన యువకుడికి కరోనా…ఏపీలో 10కి పెరిగిన కేసులు

Updated On : March 25, 2020 / 5:39 PM IST

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇవాళ మరో రెండు కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పదికి చేరింది.

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇవాళ మరో రెండు కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పదికి చేరింది. అమెరికా నుంచి వచ్చిన ఓ యువకుడు, ఢిల్లీ వెళ్లొచ్చిన మరో వ్యక్తికి జరిపిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరూ విజయవాడకు చెందినవారే కావడంతో అక్కడ ఆందోళన వ్యక్తం అవుతోంది. 

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. కరోనా అనుమానిత కేసులను ఆరోగ్య శ్రీ కింద వైద్య సేవలందించాలని ప్రైవేటు ఆసుపత్రులకు ఆదేశాలు జారీ చేశారు. విదేశాల నుంచి ఏపీకి 29 వేల మంది విదేశీయులు రాష్ట్రానికి రావడం జరిగిందన్నారు. ప్రతింటికి ఫీవర్ సర్వే ఉంటుందని, ప్రజలెవరూ బయటకు రావొద్దని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో క్వారంటైన్ సెంటర్లు పెడుతున్నట్లు చెప్పారు. 

హైదరాబాద్‌లో హాస్టళ్లు, మెస్‌ల మూసివేశారు. ఏపీ విద్యార్థుల అగచాట్ల అంశాన్ని ఏపీ ప్రభుత్వం.. తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో ఏపీ మంత్రి బొత్స సత్యన్నారాయణ మాట్లాడారు. హాస్టళ్ల నుంచి విద్యార్థులను ఖాళీ చేయిస్తున్నారని, వారికి రవాణా ఇబ్బందులు ఉన్నాయని మంత్రి బొత్స చెప్పారు. ఈ సమయంలో ఒక చోట నుంచి ఇంకో చోటకు కదలడం కూడా శ్రేయస్కరం కాదని కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు.

ఇదే అంశాలను ఏపీ సీఎస్.. తెలంగాణ సీఎస్‌ దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ సీఎస్‌ సోమేష్‌కుమార్‌తో ఏపీ సీఎస్‌ నీలం సాహ్ని మాట్లాడిన అనంతరం తెలంగాణ సీఎంఓ అధికారులతో ఏపీ సీఎంఓ అధికారులు మాట్లాడారు. ప్రత్యేకంగా పోలీసులు పాసులు ఇస్తున్న ఘటనలు కూడా తమ దృష్టికి వచ్చిందనీ ఏపీ సీఎస్ తెలిపారు. ఈ సంప్రదింపుల తర్వాత హాస్టళ్లను, పీజీ మెస్‌లను మూసేయవద్దని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ విస్పష్ట ప్రకటన చేశారు.హాస్టళ్ల యజమానులతో సంప్రదింపులు జరపాలని సిటీ పోలీస్‌ కమిషనర్, మేయర్‌కు ఆదేశాలు జారీ చేశారు.

హాస్టళ్లు మూసివేత ప్రచారాలు చేయొద్దని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ హెచ్చరించారు. హైదరాబాద్‌లో ఉంటున్న ఏపీ విద్యార్థులు, ప్రైవేటు సంస్థల్లో ఉన్నవారు ఎక్కడివారు అక్కడే ఉండాలని ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కరోనా వైరస్‌ వేగంగా వ్యాపిస్తున్న సమయంలో బయటకు రావొద్దని విజ్ఞప్తి చేసింది.

కరోనా వ్యాప్తిని నియంత్రణపై దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. దేశంలో ఇతర రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు కూడా కఠినమైన ఆంక్షలతో లాక్ డౌన్ విధించాయి. ఇటలీ తరహాలో కరోనా మహమ్మారి విజృంభించకుండా ఉండేలా నియంత్రణ చర్యలు చేపట్టిన ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.

లాక్ డౌన్ విధించినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో జనం వాహనాల్లో బయటకు రావడం రోడ్లపై తిరగడంపై పోలీసులు సీరియస్‌‍గా తీసుకున్నారు. బయటకు అడుగుపెడితే లాఠీఛార్జ్ చేస్తూ ఇంటికి తరమేస్తున్నారు. వాహనాలను సీజ్ చేయడం.. కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో ఏపీలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. అత్యవసర సేవలు మినహా అన్ని సేవలు బంద్ అయ్యాయి. 
Also Read | సౌదీ నుంచి వచ్చిన మూడేళ్ల చిన్నారికి కరోనా…తెలంగాణలో 41కి పెరిగిన కేసులు