Perni Nani: మాజీ మంత్రి పేర్ని నానికి అరెస్ట్ వారెంట్ జారీ..
ఈ కేసులో పేర్ని నాని సాక్షిగా ఉన్నారు.

Perni Nani: వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది మచిలీపట్నం కోర్టు. టీడీపీ కార్యకర్త శ్రీహర్ష కేసులో కోర్టుకు హాజరు కావడం లేదని అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసులో పేర్ని నాని సాక్షిగా ఉన్నారు. వరుస వాయిదాలతో పేర్నినాని కోర్టుకు హాజరు కాలేదు. దీంతో అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
Also Read: రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. రైతుభరోసా నిధులు విడుదల.. 9 రోజుల్లో 9వేల కోట్లు..
2019లో ఘర్షణలకు సంబంధించిన కేసులో టీడీపీ కార్యకర్తలుగా ఉన్న చందు, శ్రీహర్షలపై పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారు. ఈ కేసులో పేర్ని నాని సాక్షిగా ఉన్నారు. వరుసగా నోటీసులు వస్తున్నా విచారణకు హాజరు కావడం లేదు. ఈ నేపథ్యంలో పేర్ని నానిని అరెస్ట్ చేయాలంటూ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది మచిలీపట్నం కోర్టు. విచారణను సెప్టెంబర్ 19వ తేదీకి వాయిదా వేసింది.
2019లో జరిగిన ఘర్షణల కేసులో చంద్రు, శ్రీహర్షలపైన కేసు నమోదవటం, ఆ కేసులు పేర్ని నాని సాక్షిగా ఉండటం, వరుసగా విచారణలు జరుగుతున్నప్పుడు కూడా పేర్ని నాని కోర్టు విచారణకు హాజరు కాకపోవడంతో ఆయనకి అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది.