Cricket Betting : విశాఖలో భారీ క్రికెట్ దందా.. రూ.350 కోట్ల బెట్టింగ్
విశాఖ పరిసర ప్రాంతాల్లో వందలాది మంది అమాయక యువకులు బెట్టింగ్ ఉచ్చులో చిక్కుకున్నారు. అనామక మొబైల్ అప్లికేషన్స్ ద్వారా బెట్టింగ్ నిర్వహణ చేస్తున్నారు.

cricket betting gang
Cricket Betting Gang Arrest : విశాఖలో భారీ క్రికెట్ దందా బట్టబయలు అయింది. సుమారూ రూ.350 కోట్ల క్రికెట్ బెట్టింగ్ వెలుగులోకి వచ్చింది. విశాఖ వేదికగా అంతర్జాతీయ స్థాయిలో బెట్టింగ్ చేస్తున్న ముఠా అరెస్టు అయింది. కింగ్ పిన్ మోను @ దినేష్, వాసుదేవ్, సూరి బాబులతో పాటు 11 మందిని విశాఖ సైబర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఒక్క మోను అకౌంట్స్ నుంచే రూ.145 కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగినట్టు అధికారులు గుర్తించారు. విశాఖ పరిసర ప్రాంతాల్లో వందలాది మంది అమాయక యువకులు బెట్టింగ్ ఉచ్చులో చిక్కుకున్నారు.
Uttar Pradesh : కూతురు పెళ్లి కోసం బ్యాంకు లాకర్‌లో ఉంచిన రూ.18 లక్షలకు పట్టిన చెదపురుగులు
అనామక మొబైల్ అప్లికేషన్స్ ద్వారా బెట్టింగ్ నిర్వహణ చేస్తున్నారు. బెట్టింగ్ రాయుల్ల కోసం పోలీసు అధికారులపై విపరీతమైన ఒత్తిళ్లు వస్తున్నాయి. సీపీ రవి శంకర్ అయ్యన్నార్ స్వయంగా విచారణ చేస్తున్నారు.