CWC Meeting Discussion Key Decisions : రేపు సిడబ్ల్యుసి సమావేశం..ఎఐసిసి అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ తోపాటు కీలక నిర్ణయాలు

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సిడబ్ల్యుసి) రేపు సమావేశం జరుగనుంది. సాయంత్రం 5.30 గంటలకు సిడబ్ల్యుసి భేటీ కానుంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాలపై చర్చించనున్నారు. కాంగ్రెస్ అధిష్టానం పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. అలాగే రేపు ఎఐసిసి అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ను ఖరారు చేసే అవకాశం ఉంది.

CWC Meeting Discussion Key Decisions : రేపు సిడబ్ల్యుసి సమావేశం..ఎఐసిసి అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ తోపాటు కీలక నిర్ణయాలు

CWC Meeting Discussion Key Decisions (1)

Updated On : August 17, 2022 / 8:01 PM IST

CWC Meeting Discussion Key Decisions : కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సిడబ్ల్యుసి) సమావేశం రేపు జరుగనుంది. సాయంత్రం 5.30 గంటలకు సిడబ్ల్యుసి భేటీ కానుంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాలపై చర్చించనున్నారు. కాంగ్రెస్ అధిష్టానం పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. అలాగే రేపు ఎఐసిసి అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ను ఖరారు చేసే అవకాశం ఉంది.

సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై సిడబ్ల్యూసిలో చర్చ జరగనుంది. అక్టోబర్ 2 నుంచి భారత్ జోడో యాత్రను ప్రారంభించాలని తొలుత నిర్ణయం తీసుకున్నా.. తదుపరి సెప్టెంబర్ 7కు మార్పు చేశారు. ఆగస్టు 28న అధిక ధరలకు వ్యతిరేకంగా రాంలీలా మైదానంలో కాంగ్రెస్ భారీ ర్యాలీ నిర్వహించనుంది.

Congress Nationwide protest: నేటి నుంచి కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా ఆందోళనలు

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రూట్ మ్యాప్ ఖరారు చేశారు. మొత్తం 3571 కిలోమీటర్ల మేర భారత్ జోడో యాత్ర జరగనుంది. 68 లోకసభ నియోజకవర్గాలు, 203 అసెంబ్లీ నియోజకవర్గాల గుండా రాహుల్ గాంధీ పాదయాత్ర సాగనుంది. కన్యాకుమారి నుంచి ఆంధ్ర ప్రదేశ్ లోని ఆలూరు, తెలంగాణలోని వికారాబాద్ గుండా జమ్మూ వరకు 20 ప్రధాన నగరాలు, పట్టణాలు గుండా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సాగనుంది.

తెలంగాణలో 17 రోజుల పాటు రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర కొనసాగనుంది. ఆంధ్ర ప్రదేశ్ లో మొత్తం 100 కిలోమీటర్ల మేరకు 4 రోజుల పాటు రాహల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర సాగనుంది. ఏపీలో రెండు లోకసభ నియోజకవర్గాలు, నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల గుండా రాహుల్ గాంధీ పాదయాత్ర సాగనుంది.

Congress president Election : కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడి కోసం త్వరలోనే ఎన్నికలు..

ఆంధ్రప్రదేశ్ లోని ఓబులాపురం వద్ద ప్రవేశించి ఆలూరు, ఆదోని, పెద్ద తుంబలం, మాధవరం పట్టణాల గుండా సాగి కర్నాటకలోని రాయచూరులోకి రాహల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర ప్రవేశించనుంది. ఏపీలో రాహుల్ గాంధీ చేసే భారత్ జోడో పాదయాత్రపై ఈ నెల 25 సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఏపీలోని అనంతపురంలో ఉమెన్ చాందీ నేతృత్వంలో ముఖ్య నేతలతో పాదయాత్ర ఏర్పాట్లపై సమీక్ష జరగనుంది.