Cyclone Alert : ఉత్తరాంధ్రకు తుపాన్ ముప్పు..భారీ నుంచి అతి భారీ వర్షాలు

ఏపీకి వానగండం ఇప్పుడప్పుడు ముగిసేలా కనిపించడం లేదు. ఏపీకి మరోసారి సైక్లోన్ అలెర్ట్ జారీ అయ్యింది.. ఉత్తరాంధ్ర, పరిసర జిల్లాలకు తుపాను ముప్పు ముంచుకొస్తోంది.

Cyclone Alert : ఉత్తరాంధ్రకు తుపాన్ ముప్పు..భారీ నుంచి అతి భారీ వర్షాలు

Cyclone

Updated On : December 1, 2021 / 9:44 AM IST

Cyclone Alert To Uttarandhra : ఏపీకి వానగండం ఇప్పుడప్పుడు ముగిసేలా కనిపించడం లేదు. ఏపీకి మరోసారి సైక్లోన్ అలెర్ట్ జారీ అయ్యింది.. ఉత్తరాంధ్ర, పరిసర జిల్లాలకు తుపాను ముప్పు ముంచుకొస్తోంది. థాయిలాండ్‌ సమీపంలో ఏర్పడిన అల్పపీడనం.. ఈ నెల 4 నాటికి తుపానుగా మారి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాలపై పెను ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో ఎల్లుండి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో పాటు గంటకు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయొచ్చని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు..

Read More : Sirivennela : ఫిలించాంబర్‌లో సిరివెన్నెల భౌతికకాయం.. తరలివస్తున్న సినీ ప్రముఖులు, అభిమానులు

ఈ సైక్లోన్‌ మరింత బలపడుతూ ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరానికి చేరుకుంటుందని.. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు.. ఆ సమయంలో మత్స్యకారులు ఎవ్వరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. సైక్లోన్ అలర్ట్‌తో ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు గోదావరి జిల్లాల రైతుల్లో టెన్షన్‌ మొదలైంది… ప్రస్తుతం అక్కడ వరి కోత దశలో ఉంది. మొన్నటి వరకూ వర్షాలు కురుస్తుండటంతో కోతలు సాధ్యం కాలేదు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుట పడుతున్న సమయంలో మళ్లీ తుపాను హెచ్చరికలు రావడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.