Telugu states : తెలుగు రాష్ట్రాలపై తౌటే తుఫాన్ ఎఫెక్ట్, తెలంగాణలో రెండు రోజులు వర్షాలు

తెలుగు రాష్ట్రాలపైనా తౌటే తుఫాన్‌ ప్రభావం కనిపిస్తోంది. తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణశాఖ డైరెక్టర్‌ నాగరత్నం చెప్పారు.

Telugu states : తెలుగు రాష్ట్రాలపై తౌటే తుఫాన్ ఎఫెక్ట్, తెలంగాణలో రెండు రోజులు వర్షాలు

Telugu States

Updated On : May 17, 2021 / 7:22 AM IST

Cyclone Tauktae : తెలుగు రాష్ట్రాలపైనా తౌటే తుఫాన్‌ ప్రభావం కనిపిస్తోంది. తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణశాఖ డైరెక్టర్‌ నాగరత్నం చెప్పారు. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశం ఉందన్నారు. 2021, మే 18వ తేదీ మంగళవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

తుపాను ప్రభావం పశ్చిమ తీరంపై ఎక్కువగా ఉంటుందన్నారు. ఏపీ కోస్తా ప్రాంతంలో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో ఈదురుగాలులు, ఉరుములతో వర్షాలు కురిసే అవకాశముంది. తౌటే తుపాను ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఇక రాజధాని హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం కురింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి.

ప్రచంత భానుడి ప్రతాపంతో అల్లాడుతున్న హైదరాబాద్‌ నగర వాసులు.. సాయంత్రం కురిసిన వానలతో ఉపశమనం పొందారు. హైదరాబాద్‌ శివారు శేర్లింగంపల్లిలో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో ఈదురుగాలుల బీభత్సానికి విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. అకాల వర్షాలతో మామిడి, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.

అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాన్‌ అత్యంత తీవ్రమైన తుపాన్‌గా మారి.. ముంబైకి దక్షిణ నైరుతి దిశగా 320 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. 24 గంటల్లో తుఫాన్‌ ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని వాతావారణ శాఖ అధికారులు హెచ్చరించారు. రేపటి వరకూ భారీ వర్షాలు కురుస్తాయని సూచించారు. తుఫాన్‌ ఉత్తర వాయువ్య దిశగా పయనించి 2021, మే 17వ తేదీ సోమవారం సాయంత్రానికి గుజరాత్‌ తీరాన్ని తాకుతుందని.. మంగళవారం ఉదయం పోర్‌బందర్‌, మహువా మధ్య తీరం దాటే అవకాశముందని ఐఎండీ తెలిపింది.

Read More : Cyclone Tauktae : తౌటే తుఫాన్ బీభత్సం, వందలాది ఇళ్లు ధ్వంసం, నిరాశ్రయులైన వేలాది మంది