Visakha Sahithi Pharma Company : విశాఖ సాహితీ ఫార్మాకంపెనీలో పేలుడు ఘటన.. 6కు చేరిన మృతుల సంఖ్య

జూన్ 30వ తేదీన అచ్యుతాపురం పారిశ్రామిక వాడలో ఉన్న సాహితీ ఫార్మా కంపెనీలో రియాక్టర్ లో కెమికల్ రియాక్షన్ కోసం పాల్వెంట్ నింపుతుండగా ప్రమాదం జరిగింది. రియాక్టర్ పేలిన ఘటనలో అదే రోజు ఇద్దరు మృతి చెందారు.

Visakha Sahithi Pharma Company : విశాఖ సాహితీ ఫార్మాకంపెనీలో పేలుడు ఘటన.. 6కు చేరిన మృతుల సంఖ్య

Sahithi Pharma Company

Updated On : July 7, 2023 / 10:45 AM IST

Sahithi Pharma Company Reactor Explosion : విశాఖ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన ఘటనలో మరొకరు మృతి చెందారు. సాహితీ ఫార్మాఘటనలో 6 మృతుల సంఖ్య 6కు చేరింది. ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పోందుతూ సాది రాజబాబు మృతి చెందారు. ప్రమాదంలో గాయపడిన వారందరూ మృతి చెందారు. సాహితి ఫార్మాలో లోపాలు అధికారులు గుర్తించారు.

ఘటన జరిగిన రోజే ఇద్దరు చనిపోగా చికిత్స పొందుతున్న వారిలో మరో ఇద్దరు ఆస్పత్రిలో చనిపోయారు. గురువారం మరో ఇద్దరు చనిపోయారు. మొత్తం మృతుల సంఖ్య ఆరుకు చేరింది. జూన్ 30వ తేదీన అచ్యుతాపురం పారిశ్రామిక వాడలో ఉన్న సాహితీ ఫార్మా కంపెనీలో రియాక్టర్ లో కెమికల్ రియాక్షన్ కోసం పాల్వెంట్ నింపుతుండగా ప్రమాదం జరిగింది. రియాక్టర్ పేలిన ఘటనలో అదే రోజు ఇద్దరు మృతి చెందారు.

TSRTC Bus Fire Accident : హైదరాబాద్ లో ఆర్టీసీ బస్సులో అగ్నిప్రమాదం

గాయపడిన అరుగురిలో చికిత్స పొందుతూ ఇద్దరు ఆ తర్వాత మరణించారు. మిగిలిన వారిలో పరిస్థితి విషమించడంతో రాంబిల్లి మండలం పంచదార్ల శివారు ధారపాలెం గ్రామానికి చెందిన సింగంశెట్టి నూకినాయుడు, నక్కపల్లి మండలం రేబాక గ్రామానికి చెందిన సాది రాజబాబు మృతి చెందారు.

ఈ ఘటనలో మొత్తం మృతుల సంఖ్య ఆరుకు చేరింది. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యం నుంచి రూ.25లక్షల పరిహారం ఇప్పిస్తామని హామీ ఇప్పించింది. విశాఖ పారిశ్రామిక ప్రాంతంలో తరచూ జరుగుతున్న ప్రమాదాలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టింది.