Amaravati Media : రాజధాని ప్రాంతంలోకి మీడియాకు అనుమతి నిరాకరణ

రాజధాని ప్రాంతంలోకి మీడియాకు అనుమతి నిరాకరించారు. చెక్ పోస్టులు ఏర్పాటు చేసి మీడియా ప్రతినిధులను పోలీసులు నిలిపివేస్తున్నారు.

Amaravati Media : రాజధాని ప్రాంతంలోకి మీడియాకు అనుమతి నిరాకరణ

Amaravati Media

Updated On : August 8, 2021 / 11:32 AM IST

Amaravati media no permision : అమరావతి రాజధానిలో రైతుల నిరసనలు 600వ రోజుకు చేరుకున్నాయి. భారీ ర్యాలీలకు రాజధాని రైతులు పిలుపునిచ్చారు. భారీగా పోలీసులు మోహరించారు. రాజధానిలోకి కొత్తవారిని అనుమతించడం లేదు. రాజధానిలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

ప్రకాశం బ్యారేజీ, సీతానగరంతో పాటు రాజధాని ప్రాంతంలో బారీగా పోలీసులు మోహరించారు. ప్రకాశం బ్యారేజీ సహా కరకట్ట వెంట పోలీసులు ఆంక్షలు విధించారు. కరకట్టపై 4 చోట్ల చెక్ పోలీసులు ఏర్పాటు చేశారు. కరకట్టపై వాహనాలను అపి చెక్ చేస్తున్నారు.

మరోవైపు రాజధాని ప్రాంతంలోకి మీడియాకు అనుమతి నిరాకరించారు. చెక్ పోస్టులు ఏర్పాటు చేసి మీడియా ప్రతినిధులను పోలీసులు నిలిపివేస్తున్నారు. కరకట్టపై మంతెన సత్యనారాయణ ఆశ్రమం వద్దే మీడియా ప్రతినిధులను అడ్డగించారు. రాజధానిలోకి మీడియాను పంపించవద్దని పైనుంచి ఆదేశాలు వచ్చాయని పోలీసులు అంటున్నారు.

విజయవాడ నుంచి ప్రకాశం బ్యారేజీ మీదుగా రాజధానికి వెళ్లే మార్గంలో అడుగడుగునా ఆంక్షలు విధించారు. ప్రకాశం బ్యారేజీ, సహా కరకట్ట వెంట పోలీసుల ఆంక్షలు విధించారు. కరకట్టపై నాలుగు చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. భారీ ఎత్తున పోలీసులను మొహరించారు.

స్థానికులను మాత్రమే కరకట్ట రహదారిపై అనుమతిస్తున్నారు. ఆధార్ కార్డు లేదా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఉంటేనే రాకపోకలకు అనుమతిస్తున్నారు. వాహనాలను పూర్తిగా తనిఖీ చేశాకే పంపిస్తున్నారు. పోలీసు ఆంక్షలతో స్థానుకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.