Pawan Kalyan : డిప్యూటీ సీఎం పవన్ సంచలన నిర్ణయం.. కొత్త ఏడాది నుంచి ప్రజల మధ్యకు.. నెలకో జిల్లాలో పర్యటన!
Pawan Kalyan : 2025 కొత్త ఏడాది నుంచి ప్రజల మధ్యకు వెళ్లి వారి ఇబ్బందులు తీసుకొనేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ప్రతి నెల ఒక జిల్లాను ఎంచుకొని పవన్ పర్యటించనున్నారు.

Deputy CM Pawan Kalyan Sensational Decision
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా పాలన అందిస్తామనే హామీతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రతి నెలా ఒక జిల్లాలో పర్యటించాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. క్షేత్ర స్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు పవన్ స్వయంగా రంగంలోకి దిగనున్నారు.
Read Also : వైసీపీ ముందస్తు నిరసనలతో టీడీపీకే లాభమా? వైసీపీ నిరసనలకు అనుకున్నంత రెస్పాన్స్ రావడం లేదా?
2025 కొత్త ఏడాది నుంచి ప్రజల మధ్యకు వెళ్లి వారి ఇబ్బందులు తీసుకొనేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ప్రతి నెల ఒక జిల్లాను ఎంచుకొని పవన్ పర్యటించనున్నారు. ఆ జిల్లాలో వెనుకబడిన, గ్రామీణ ప్రాంతాల్లో క్యాంపు చేసేలా ఏర్పాట్లు ఉండాలని తన కార్యాలయ అధికారులకి డిప్యూటీ సీఎం దిశానిర్దేశం చేశారు.
జిల్లాలోని సమస్యలు, ప్రజల స్థితిగతులు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును ప్రత్యక్షంగా ఆయన పరిశీలించనున్నారు. పర్యటనలో రోజంతా ప్రజలతో మమేకం కానున్నారు.
ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీ బిజీగా ఉన్నారు. రిమ్స్‌లో చికిత్స తీసుకుంటున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును పవన్ పరామర్శించారు. బాధితుడు ఎంపీడీఓ జవహర్ బాబుకు, కుటుంబసభ్యులకు నేనున్నాను.. ధైర్యంగా ఉండమంటూ పవన్ భరోసా కల్పించారు.
Read Also : ఫ్యాన్స్‌పై పవన్ కల్యాణ్ అసహనం వ్యక్తం చేసిన వేళ.. “ఓజీ” సినిమాపై డీవీవీ మూవీస్ కీలక కామెంట్స్