Kurnool District : మహిళా రైతు పంట పండింది.. పొలంలో దొరికిన వజ్రంతో లక్షాధికారి అయ్యింది

రాయలసీమలో వర్షాకాలంలో వజ్రాలు దొరకడం కొత్త కాదు. కానీ ఎవరికి దొరికింది? ఎంత లాభపడ్డారు? అనేది చెప్పుకుంటారు. ఓ మహిళా రైతుకి విలువైన వజ్రం దొరికింది. ఇప్పుడామె లక్షాధికారి అయ్యింది.

Kurnool District : మహిళా రైతు పంట పండింది.. పొలంలో దొరికిన వజ్రంతో లక్షాధికారి అయ్యింది

Kurnool District

Updated On : July 16, 2023 / 4:25 PM IST

Kurnool District : కర్నూలు జిల్లాలో వజ్రాలు దొరకడం కొత్త కాదు.. అయితే ఆ వజ్రం వారికి ఎంత లాభం తెచ్చిపెట్టింది? అన్నదే వార్త. తాజాగా ఓ మహిళకు విలువైన వజ్రం దొరికింది. దానిని అమ్మితే రూ.14 లక్షల రూపాయలతో పాటు 4 తులాల బంగారం వచ్చిందట.

Kurnool Diamonds Hunt : కర్నూలులో వజ్రాల వేట షురూ .. రైతుకు దొరికిన వజ్రం, రూ. రెండు కోట్లకు కొనుగోలు చేసిన వ్యాపారి

వర్షాకాలంలో రాయలసీమలో వజ్రాల వేట ఎప్పుడూ జరుగుతుంది. తొలకరి మొదలవ్వగానే సాధారణంగా రైతులంతా తమ పంటలు వేసుకునే పనిలో బిజీగా ఉంటారు. కానీ ఇక్కడి వారు మాత్రం వజ్రాల వేటలో మునిగిపోతారు. తమ పొలంలో చిన్న రాయి ఏదైనా కొత్తగా కనిపిస్తే అది వజ్రమేమో అంటూ బంగారం షాపులకు పరుగులు పెడతారు. ఒక్క విలువైన వజ్రం దొరికితే జీవితం సెటిలైపోయినట్లే అని భావిస్తారు. ఇక్కడి వారే కాదు ఎక్కడెక్కడి జిల్లాల వారు వజ్రాల కోసం రాయలసీమకు ఈ సీజన్‌లో క్యూ కడతారు.

తాజాగా మద్దికేర మండలం మదనంతపురం గ్రామానికి చెందిన మహిళా రైతును అదృష్టం వరించింది. విలువైన వజ్రం దొరికింది. దానికి రూ.14 లక్షల నగదుతో పాటు 4 తులాల బంగారం ఇచ్చి ఓ వ్యాపారి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇక అతనికి దీనిపై మూడింతలు లాభం రావచ్చని చర్చ జరుగుతోంది.

Lab Grown Diamond: వజ్రాలను ల్యాబ్‌లో తయారు చేస్తారా.. ఇంతకీ ల్యాబ్ గ్రోన్ డైమండ్ అంటే ఏంటి?

మొత్తానికి మహిళా రైతు కాస్త వజ్రం కారణంగా లక్షాధికారి అయిపోయింది.  ఈ సీజన్ పూర్తయ్యే వరకూ ఈ వజ్రాల వేట కొనసాగుతూనే ఉంటుంది. ఇంకా ఎంతమందిని అదృష్టం వరిస్తుందో చూడాలి.