Punganur Incident : మారణాయుధాలతో ఉద్దేశపూర్వకంగానే పోలీసులపై దాడి.. ఎవరిని వదిలిపెట్టం : డీఐజీ, ఎస్పీ

ఈ ఘటనతో సంబంధం ఉన్న 40 మందిని ఇప్పటికి అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వారిపై హత్యాయత్నం కింద కేసులు నమోదు చేస్తున్నామని వెల్లడించారు.

Punganur Incident : మారణాయుధాలతో ఉద్దేశపూర్వకంగానే పోలీసులపై దాడి.. ఎవరిని వదిలిపెట్టం : డీఐజీ, ఎస్పీ

Punganur incident

Updated On : August 5, 2023 / 3:10 PM IST

Punganur Incident – Press Meet : చిత్తూరు జిల్లా పుంగనూరు ఘటనలో బాధితులంతా పోలీసులేనని డీఐజీ అమ్మిరెడ్డి, ఎస్పీ రిశాంత్ రెడ్డి తెలిపారు. 13 మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు. మరో 20 మంది పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయని వెల్లడించారు. పుంగనూరు ఘటనపై శనివారం మీడియాతో డీఐజీ అమ్మిరెడ్డి, ఎస్పీ రిశాంత్ రెడ్డి మాట్లాడారు. ఘటనకు సంబంధించిన వివరాలను వివరించారు.

ఈ ఘటనతో సంబంధం ఉన్న 40 మందిని ఇప్పటికి అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వారిపై హత్యాయత్నం కింద కేసులు నమోదు చేస్తున్నామని వెల్లడించారు. పోలీసులు సంయమనం పాటించారని తెలిపారు. ఈ దాడి వెనుక సీరియస్ కుట్ర ఉన్నట్లు నిర్ధారణకు వచ్చామని పేర్కొన్నారు.

Paritala Sunitha : చంద్రబాబు ఒక్క మాట చెబితే.. వైఎస్ఆర్ గూండాలు రోడ్లపై తిరగలేరు : పరిటాల సునీత

మారణాయుధాలతో వారు ఉద్దేశపూర్వకంగా తమపై దాడికి యత్నించారని చెప్పారు. ఈ ఘటనపై లోతైన విచారణ కొనసాగుతోందని.. ఎవరిని వదిలిపెట్టేది లేదన స్పష్టం చేశారు. పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ చల్లా బాబు.. చంద్రబాబు రూట్ మ్యాప్ ను మార్చాలని చూశారని ఆరోపించారు.