ఏపీలో కూటమి సర్కార్ పాలనలో ఏడాదిలో ఇన్ని పనులు చేశాం: మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి
ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించలేదని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్ పాలనకు ఏడాది పూర్తయింది. అఖండ విజయాన్ని అందించిన ప్రజల ఆకాంక్షలకు పట్టం కడుతూ పరిపాలన కొనసాగిస్తోంది కూటమి సర్కార్. అమరావతి రాజధాని.. పోలవరం స్వప్నాన్ని.. సాకారం చేస్తూ ముందడుగు వేసింది.
సంక్షేమం.. అభివృద్ధిని సమ్మిళితం చేస్తూ.. కూటమి సర్కార్ ఏడాది ప్రయాణం సాగింది. కూటమి ప్రభుత్వం ఏడాది పరిపాలనపై 10TV మెగా ఈవెంట్ “Shining AP” నిర్వహించింది. ఇందులో ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి పాల్గొని మాట్లాడారు.
“ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని మళ్లీ గాడిలో పెట్టాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రజలు కూటమికి అధికారం కట్టబెట్టారని తెలిపారు. చంద్రబాబు నాయుడు నాకు పూర్తిగా సర్వీస్ సెక్టార్ ఇచ్చారు. వారి ఆలోచలనకు అనుగుణంగా పనిచేస్తానన్న నమ్మకం నాకు ఉంది. ఇంతకుముందు వైసీపీ పాలనలో అన్ని శాఖల్లోనూ పాలన అస్తవ్యస్తంగా ఉంది. అన్నింట్లోనూ నిర్లక్ష్యం కనపడింది.
వైసీసీ పాలనలో సాంఘిక సంక్షేమ శాఖలో విద్యా దీవెన, వసతి దీవెన అన్నారు. కనీసం 50 శాతంస్కాలర్‌షిప్‌లకు కూడా బడ్జెట్ కేటాయించలేదు. 2024-25లో మేము పూర్తి స్థాయిలో స్కాలర్‌షిప్‌లకు నిధులు విడుదల చేశాం. హాస్టల్ రిపేర్లకు వైసీపీ తక్కువ మొత్తంలో కేటాయించింది. మూము వచ్చాక రూ.143 కోట్లు కేటాయించాం.
ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించలేదు. అన్నా క్యాంటీన్లను కనీసం వేరే పేరుతోనూ వైసీపీ కొనసాగించలేదు. దీపం-2 కింద ఇప్పటికే ఒక సిలిండర్ చొప్పున మేము ఇచ్చాం. రెండో సిలిండర్ కూడా ప్రజలు తీసుకుంటున్నారు. తల్లికి వందనం కూడా ఇవ్వబోతున్నాం” అని డోలా బాల వీరాంజనేయస్వామి తెలిపారు.
ఇంకా ఏమన్నారు? పూర్తి ఇంటర్వ్యూ..