Shining AP: బందరు పోర్టుపై మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు.. కొడాలి నాని, పేర్ని నాని అరెస్టు ఎప్పుడంటే…?

తిరిగి వెళ్లిపోయిన కంపెనీలు కూడా ఇప్పుడు మళ్లీ ఏపీకి వస్తున్నాయని తెలిపారు.

Shining AP: బందరు పోర్టుపై మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు.. కొడాలి నాని, పేర్ని నాని అరెస్టు ఎప్పుడంటే…?

Updated On : June 12, 2025 / 12:16 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్‌ పాలనకు ఏడాది పూర్తయింది. బ్రాండ్‌ APని తీర్చిదిద్దడంలో ఏడాది ప్రయాణం ఎలా సాగింది? భావితరాల భవిష్యత్‌కు ఇచ్చిన భరోసా ఎంత? సాధించిన విజయాలు, అధిగమించాల్సిన మైలురాళ్లు ఏంటి? కూటమి ప్రభుత్వం ఏడాది పరిపాలనపై 10TV మెగా ఈవెంట్‌ “Shining AP” నిర్వహించింది.

ఇందులో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడారు. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సమన్వయం బాగా ఉందని కొల్లు రవీంద్ర అన్నారు. చిన్న చిన్న సమస్యలు కుటుంబంలోనూ ఉంటాయని అంతేగానీ, ఎక్కడా విభేదాలు ఏవీ లేవని తెలిపారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ తమకు చక్కని డైరెక్షన్ ఇచ్చారని చెప్పారు. దాని ప్రకారం తాము ముందుకు వెళ్తున్నామని తెలిపారు. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే తమ నాయకులు దీన్ని సమన్వయం చేసుకుంటారని అన్నారు.

తిరిగి వెళ్లిపోయిన కంపెనీలు కూడా ఇప్పుడు మళ్లీ ఏపీకి వస్తున్నాయని తెలిపారు. “వైసీపీ విధ్వంసానికి ఫుల్‌ స్టాప్‌ పెట్టాం. అభివృద్ధికి, సంక్షేమానికి పట్టంగట్టాం. వైసీపీ హయాంలో ఆస్తులను ధ్వంసం చేశారు. ప్రజలను భయపెట్టారు. ప్రజలు రికార్డు స్థాయిలో 164 స్థానాల్లో మమ్మల్ని గెలిపించారు.

Also Read: అన్నా క్యాంటీన్ల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లి స్టడీ చేశాను.. వీటి కోసమేమో విదేశాలకు వెళ్లి అధ్యయనం చేశాను: మంత్రి నారాయణ

ఎవరూ ఊహించనంత మెజార్టీ ఇది. ఈ ఏడాది కాలం పూర్తిగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్‌తో రాష్ట్రాన్ని అభివృద్ధి ట్రాక్‌పైకి తీసుకొచ్చాం. రాష్ట్రంలో ఆగిపోయిన పనులన్నీ చేస్తున్నాం. పోలవరం, అమరావతి పనులు మళ్లీ మొదలయ్యాయి.

సూపర్‌ సిక్స్‌ హామీల్లో ఇప్పటికే 70 శాతం అమలు చేశాం. మిగిలినవి కూడా రెండు-మూడు నెలల్లో పూర్తి చేస్తాం. కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని జగన్ అంటున్నారు. జగన్‌ రెడ్డి వెన్నుపోటుకు పితామహుడు. రాష్ట్రాన్ని నాశనం చేశారు. సొంత కుటుంబాన్ని వెన్నుపోటు పొడిచారు. ప్రజలను వెన్నుపోటు పొడిచారు.

చాలా మందికి వెన్నుపోటు పొడిచారు. వారు చేసిన అవినీతి కార్యక్రమాలన్నీ బయటకు వస్తున్నాయి. వైసీసీ మద్యం కుంభకోణానికి పాల్పడింది. ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది. పెట్టుబడులు వస్తున్నాయి. తిరిగి వెళ్లిపోయిన కంపెనీలు కూడా ఇప్పుడు మళ్లీ ఏపీకి వస్తున్నాయి” అని కొల్లు రవీంద్ర అన్నారు.

ఏపీ లిక్కర్ స్కామ్ లో మాజీ సీఎం జగన్ అరెస్ట్ చేస్తారా? అన్న విషయంపై కొల్లు రవీంద్ర స్పందించారు. “నేను కచ్చితంగా చెబుతున్నా మా పార్టీలో మా నాయకుడి ఆలోచనల్లో కక్ష సాధింపు అనేది ఎప్పుడూ ఉండదు. దానికి అసలు తావే లేదు. కాకపోతే తప్పు చేసిన వాళ్లని వదిలే సమస్య లేదు” అని తెలిపారు.

బందరు పోర్టుపై మంత్రి కొల్లు రవీంద్ర కీలక ఏమన్నారు? కొడాలి నాని, పేర్ని నాని గురించి ఏం చెప్పారు?

పూర్తి ఇంటర్వ్యూ..