Duronto Express Catches Fire : దురంతో ఎక్స్‌ప్రెస్‌‌లో మంటలు.. భయంతో ప్రయాణికుల పరుగులు

దురంతో ఎక్స్‌ప్రెస్‌లో మంటలు కలకలం రేపాయి. మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. భయంతో పరుగులు తీశారు. చిత్తూరు జిల్లా కుప్పం రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది.

Duronto Express Catches Fire : దురంతో ఎక్స్‌ప్రెస్‌‌లో మంటలు.. భయంతో ప్రయాణికుల పరుగులు

Updated On : November 27, 2022 / 6:26 PM IST

Duronto Express Catches Fire : దురంతో ఎక్స్‌ప్రెస్‌లో మంటలు కలకలం రేపాయి. మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. భయంతో పరుగులు తీశారు. చిత్తూరు జిల్లా కుప్పం రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది.

Also Read : Trainman App Offers: రైల్వే ప్రయాణీకులకు గుడ్‌న్యూస్ చెప్పిన ట్రైన్‌మ్యాన్.. రైలు టికెట్ కన్ఫర్మ్ కాకపోతే ఫ్లైట్ టికెట్ ఉచితం ..

బెంగళూరు నుంచి హౌరా వెళ్తున్న దురంతో ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్-9 బోగీలో మంటలతో కూడిన పొగలు వచ్చాయి. ఇది గమనించిన డ్రైవర్‌.. కుప్పం రైల్వేస్టేషన్‌లో రైలును ఆపేశాడు. ఈ విషయం తెలిసిన ప్రయాణికులు రైలు దిగి పరుగులు తీశారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పేయడంతో పెనుప్రమాదం తప్పింది. కాసేపటి తర్వాత రైలు తిరిగి బయలుదేరింది. అయితే, మంటలు స్వల్పంగా చెలరేగడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు.

Also Read : Thieves Rob Train Engine : ఏకంగా రైలింజన్నే ఎత్తుకెళ్లిన దొంగలు

ఈ అగ్నిప్రమాదంపై భారత రైల్వే అధికారిక ప్రకటన చేసింది. కోచ్ బ్రేక్.. బైండింగ్ కు గురైందని.. బ్రేక్ బ్లాక్ రాపిడి కారణంగా బోగీ నుండి మంటలతో కూడిన పొగ రావడం ప్రారంభించిందని వివరించింది.