దువ్వాడ ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్.. శ్రీనివాస్‌కు షాకిచ్చిన వైసీపీ హైకమాండ్

దువ్వాడ శ్రీనివాస్ - వాణి వివాదంపై వైసీపీ అధిష్టానం స్పందించింది. వాణి నిరసన తెలుపుతున్న ఇంటి వద్ద టెక్కలి వైసీపీ కార్యాలయం అని..

దువ్వాడ ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్.. శ్రీనివాస్‌కు షాకిచ్చిన వైసీపీ హైకమాండ్

Duvvada Family Controversy

Updated On : August 23, 2024 / 8:48 AM IST

Duvvada Family Controversy : శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ఎదుట కారు షెడ్ లోనే ఆయన సతీమణి దువ్వాడ వాణి, కుమార్తెలు నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. వాణి నిరసన 16వ రోజుకు చేరుకుంది. తనకు ఎటువంటి ఆస్తి వద్దని, దువ్వాడ శ్రీనుతో కలిసి ఉండటానికి నేను, నా పిల్లలు సిద్ధంగా ఉన్నామని వాణి చెబుతుంది. అయితే, శ్రీనివాస్ మాత్రం తనకు విడాకులే కావాలని కోరుతున్నాడు. తన ఇంటి వద్ద నిరసన చేస్తున్న వారిని ఖాళీ చేయించాలని శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించాడు.

Also Read : దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం.. నలిగిపోతున్న టెక్కలి వైసీపీ నేతలు..!

దువ్వాడ శ్రీనివాస్ – వాణి వివాదంపై వైసీపీ అధిష్టానం స్పందించింది. వాణి నిరసన తెలుపుతున్న ఇంటి వద్ద టెక్కలి వైసీపీ కార్యాలయం అని దువ్వాడ శ్రీనివాస్ బోర్డు పెట్టాడు. వివాదాస్పద ఇంటిపై వైసీపీ బోర్డు పెట్టడంతో.. కుటుంబ వివాదంలోకి పార్టీని లాగడంపై వైసీపీ హైకమాండ్ సీరియస్ అయింది. టెక్కలి వైసీపీ ఇన్ ఛార్జిగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ ను మారుస్తూ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు.

Also Read : Duvvada Family Controversy : రోజుకో మలుపు తిరుగుతున్న దువ్వాడ ఫ్యామిలీ వ్యవహారం..

టెక్కలి నియోజకవర్గం నూతన ఇంచార్జిగా పేరాడ తిలక్ ను వైసీపీ అధిష్టానం నియమించింది. దీంతో పార్టీ అధిష్టానం నుంచి దువ్వాడ శ్రీనివాస్ కు గట్టి షాక్ తగిలినట్లయింది. వాణి – శ్రీనివాస్ వివాదంలో రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటుండటంతో కుటుంబ పెద్దలు వారి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇరు వర్గాలు ఇప్పటికే కోర్టులను ఆశ్రయించాయి.